ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆపిల్ తింటే హాస్పిటల్ పాలు కావాల్సి ఉంది.ఎందుకంటే ఆపిల్ పైన వేసే మైనం కోటింగ్.
ఆపిల్ పండ్లు తాజాగా మెరవటానికి మరియు బాగా
ఆకర్షించటానికి పారాఫిన్ అనే మైనాన్ని ఆపిల్ కి కోటింగ్ వేస్తున్నారు
నిజానికి చెట్లు సూక్ష్మజీవుల నుంచి సేకరించే సెల్లాక్, తేనెతుట్టె నుంచి వచ్చే హానీబీ వ్యాక్స్ , కార్నబా వ్యాక్స్‌ను మాత్రమే ఆపిల్ పండ్లకు ఉపయోగించాలి.అయితే చాలా ఖర్చు అవుతుందని వ్యాపారాలు తక్కువ ధరకు వచ్చే పారాఫిన్‌ను వాడుతున్నారు.
సాధారణంగా ఆపిల్ లో నీటి శాతం తగ్గకుండా
ఉండేందుకు వాక్స్ వేస్తారు.వాక్స్ ని మండించి ఆపిల్ కి ఫై పూతగా వాక్స్
వేస్తారు
కొవ్వుత్తుల తయారీలో ఉపయోగించే మైనాన్ని ఆపిల్ పై పూతగా వాడితే జీర్ణ
వ్యవస్థ దెబ్బతినడం,పెద్ద, చిన్న ప్రేగులు దెబ్బతినే ప్రమాదం, శ్వాసకోశ
వ్యాధులు,అల్సర్లు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందువల్ల
ఆపిల్ పై మైనాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం
మైనం కోటింగ్ ఉన్న ఆపిల్ పండ్లను 5 నిమిషాల పాటు వేడినీటిలో ఉంచాలి.ఆ
తర్వాత చల్లని నీటితో కడగాలి
ఒక బౌల్ నీటిని తీసుకోని దానిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో ఆపిల్ పండ్లను వేసి
5 నిముషాలు అయ్యాక బ్రష్ సాయంతో మైనాన్ని తొలగించాలి .నిమ్మరసానికి
బదులు వెనిగర్ ని కూడా ఉపయోగించవచ్చు
ఆపిల్ సీడర్ వెనిగర్ కూడా పండ్లపై మైనంను తొలగించటానికి సహాయపడతాయి.ఈ
ద్రావణంలో ఆపిల్ ను ముంచి టిష్యూ లేదా శుభ్రమైన క్లాత్‌తో రుద్దాలి.తర్వాత నీటితో శుభ్రంగా కడిగి ఆరగించాలి
చాలా మంది మైనం తొలగించడం కోసం ఆపిల్ పై తొక్కను పూర్తిగా తొలగిస్తారు.
అయితే, దీనివల్ల ఆపిల్ తొక్కలో ఉండే పోషకాలు, ఫైబర్ శరీరానికి అందవు
చూసారుగా ఆపిల్ పై మైనాన్ని తొలగించి ఆపిల్ ని తొక్కతో సహా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.