మనకు ఆహారం జీర్ణం కాకపోతే చాలా అసౌకర్యంగా ఉంటుంది.కాస్త లోతుగా ఆలోచిస్తే మన శరీరంలో జరిగే అన్ని కార్యకలాపాల నియంత్రణ మెదడు చేస్తుంది.
మెదడులో భావోద్వేగాలను నియంత్రించే డోపమైన్ అనే రసాయనం పొట్టలో అసౌకర్యానికి కారణం కావచ్చు.అంతేకాక ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది.
అందువలన మన శరీరంలో డోపమైన్ యొక్క ఖచ్చితమైన స్థాయిని నిర్వహించవలసిన అవసరం ఉంది.అయితే శరీరంలో డోపమైన్ స్థాయిలను నిర్వహించడానికి మరియు జీర్ణక్రియ సమస్యను తొలగించడానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి.
1.కాఫీ
ప్రతి రోజు రెండు సార్లు కాఫీ త్రాగితే అజీర్ణం సమస్య తొలగించడానికి మరియు శరీరంలో డోపమైన్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుంది.ఒక కప్పు కాఫీ త్రాగిన వెంటనే ఒక శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది.అయితే కాఫీని ఎక్కువగా త్రాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.
2.అరటి పండు
అరటి పండులో అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి.
అరటి పండులో ఉండే టైరోసిన్ అనే పోషకం శరీరంలో డోపమైన్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుంది.కాబట్టి ప్రతి రోజు ఆహార ప్రణాళికలో అరటి పండు ఉండేలా చూసుకోవాలి.
3.పుచ్చకాయ
పుచ్చకాయలో విటమిన్ బి 6 సమృద్దిగా ఉండుట వలన శరీరంలో డోపమైన్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుంది.అందువలన ప్రతి రోజు పుచ్చకాయ ముక్కలను తినాలి.
4.బాదాం
బాదాంలో అనేక విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి.ప్రతి రోజు బాదాంను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో బ్లడ్ కౌంట్ పెరగటానికి సహాయపడుతుంది.
అంతేకాక శరీరంలో డోపమైన్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.అందువల్ల ప్రతి రోజు ఆహార ప్రణాళికలో బాదాం ఉండేలా చూసుకోవాలి.