ఏపీలో 2019 ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబుకు తనకన్నా చాలా చాలా జూనియర్ అయిన జగన్ చేతుల్లో ఘోర పరాజయం కిందే లెక్క.
ఇక ఫస్ట్ టైం గెలిచి, సీఎం అయ్యేందుకు అటు జగన్, ఎలాగైనా రెండోసారి గెలవాలన్న కసితో ఇటు చంద్రబాబు అధికారం కోసం ఎన్నో ఎత్తులు వేస్తున్నారు.వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉన్నా ఏపీలో అప్పుడే రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు స్టార్ట్ అయ్యాయి.
జగన్‌కు అధికారం కావాలి…ఇందుకోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉన్నాడు.ఇప్పటికే కమ్యూనిస్టులతో పొత్తుకు రెడీ అంటున్నాడు.
పీకే దెబ్బతో చాలా వరకు మారుతున్నాడు.అవసరమైతే జనసేనతో పొత్తుకు సైతం ఓకే అంటున్నాడు.
పవన్ జగన్‌తో కలిసేందుకు ఓకే అంటాడా ? లేదా ? అన్నది తర్వాత సంగతి.మరి వైసీపీకి అటు కమ్యూనిస్టులు, ఇటు పవన్ తోడైతే అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి ? ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదుగా…అందుకే అపర రాజకీయ చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు అప్పుడే తన రాజకీయ వ్యూహం స్టార్ట్ చేసేసినట్టు టీడీపీలోని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక గత ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉన్న పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీపైనే కత్తులు దూసేలా ఉన్నాడు.ఏపీకి ఏదేదో చేస్తానన్న బీజేపీ హ్యాండ్ ఇచ్చింది.మరి ఇలాగే ఎన్నికలకు వెళ్లిపోతే సీన్ రివర్స్ అవ్వకతప్పదు.ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీకి మరింత ఆకర్షణ తీసుకు రానున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగాను, తన తనయుడు లోకేశ్ మంత్రిగాను ఉన్నారు.ఇక కోడలు బ్రాహ్మణి సైతం గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు.
ఇక ఇప్పుడు వీరికి తోడుగా మాస్లో బలమైన ప్రజాకర్షణ ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీతోకి అండగా తీసుకొచ్చి, అతన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటే కొంత వరకైనా పవన్ కళ్యాణ్ మానియాని తట్టుకొని నిలబడే అవకాశం వుందని, అలాగే బీజేపీతో పొత్తు, తారక్ ప్రచారం రెండు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని చంద్రబాబుకు కొందరు సూచించినట్టు సమాచారం.
వీరి ఆలోచనలకు అనుగుణంగానే ఆయన ఇప్పటికే ఎన్టీఆర్‌ను తిరిగి టీడీపీలోకి తీసుకువచ్చి, ఆయనకు పార్టీలో కీలక పదవి అప్పగించడంతో పాటు 2019 ఎన్నికల్లో కీలక ప్రచార బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.ఇక 2010 తర్వాత ఎన్టీఆర్‌ను బాబు, బాలయ్య పక్కన పెట్టేశారు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తిరిగి వీరిద్దరికి దగ్గరవుతోన్నట్టు తెలుస్తోంది.హరికృష్ణను బాబు, బాలయ్యకు దగ్గర చేసేందుకు ఎన్టీఆర్ మిగిలిన వారసులు నెలన్నర రోజులుగా చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టే తెలుస్తోంది.
మరి ఎన్టీఆర్ అస్త్రం 2019లో టీడీపీకి ఎలా ఉపయోగపడుతుందో ? చూడాలి.