అంగరంగ వైభవంగా జరగబోతున్న తన పెళ్ళిలో తాను అత్యంత అందంగా కనబడాలని, ఎలాంటి ముభావం లేకుండా సంతృప్తిగా, సంతోషంగా కనిపించాలని ఏ అమ్మాయి అనుకోదు చెప్పండి? అమ్మాయిలు బేసిక్ గానే అలంకార ప్రియులు.అలాంటిది పెళ్లిరోజు అంటే ఇంకా అలంకారంగా తయారవుతారు.
తమ వస్త్రాలకి తగ్గట్టుగానే తమ రూపు కూడా అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు.అలాంటి ఫ్యూచర్ పెళ్ళికూతుళ్ళు బొప్పాయిని ఇష్టంగా తినండి.
ఎందుకంటే అది మిమ్మల్ని పెళ్ళి రోజు అందంగా కనబడేలా చేస్తుంది.ఎలానో, బొప్పాయి వలన పెళ్ళికూతురికి కలిగే లాభాలేంటో మీరే చూడండి.
* చర్మం లేతగా, కాంతివంతంగా కనిపించాలంటే ముందు మృతకణాలు, అంటే డెడ్ స్కిన్ సెల్స్ చర్మం నుంచి తొలిగిపోవాలి.బొప్పాయి ఈ మృతకణాలను తొలగిస్తుంది.
ఇందులో ఎంజైమ్‌టిక్ ఎఫెక్ట్ అలాంటిది.ఇది ఒక ఎక్స్ఫొలియేటింగద ఏజెంట్ లా పనిచేస్తుంది.
* బొప్పాయి చర్మరంగుని మరింత లేత రంగులోకి మారుస్తుంది.బొప్పాయి జ్యూస్ చెక్కెర లేకుండా తాగండి.
కొన్నిరోజుల్లోనే మీ చర్మం రంగులో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది.
* ముఖంలో కొంచెం కొవ్వు ఉన్నా, మీ ముఖకవళికలు తేడా కొడతాయి.కాబట్టి కొవ్వుని కరిగించుకోవాలి.
బొప్పాయిలో పపేన్ ఉంటుంది.ఇది మెటబాలిసమ్ రేటుని ట్రాక్ లో పెట్టి, కొవ్వుని కరిగిస్తుంది.
దాంతో మీరు స్లిమ్ గా, స్మార్ట్ గా కనిపిస్తారు.
* ఎండలో తిరగడం వలన మన చర్మం ట్యాన్ అయిపోతుంది.
అంటే మన నేచురల్ రంగు పోయి డార్క్ గా మారుతుంది చర్మం.ఇలాంటి సమస్యలు ఉన్నా, బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది.
స్కిన్ ట్యాన్ ని పోగొట్టి నేచురల్ రంగు అందిస్తుంది.
* నోట్ : బొప్పాయిని రోజూ తినొద్దు.అతిచేస్తే ఏదైనా అనర్థమే.ఓరోజు తింటే, మరోరోజు ఫేస్ ప్యాక్ లా వాడండి.జ్యూస్ ఎక్కువగా తాగొద్దు.ఎప్పుడో ఓసారి.







