బాలివుడ్ నుంచి హాలివుడ్ కి షిఫ్ట్ అయ్యి, చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా.ఇప్పుడు ప్రియాంక అంటే ఓ గ్లోబల్ స్టార్.
ప్రపంచం నలుమూలలా ప్రియాంక పేరు తెలుసు.అంతెదుకు, ఈమధ్య జరిగిన ఓ సర్వేలో ఎమ్మా వాట్సన్, ఏంజలీనా జోలీ లాంటి లేడి సూపర్ స్టార్స్ ని దాటి, ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల్లో రెండొవ స్థానం దక్కించుకుంది ప్రియాంక.
మరి అలాంటి హాలివుడ్ స్టార్, హాలివుడ్ కల్చర్ కి అలవాటు పడటంలో తప్పు ఏమి లేదు కదా?
విషయం ఏమిటంటే, కొన్నిరోజులు సెలవులు గడిపేందుకు ఇండియాకి వచ్చింది ప్రియాంక.గ్లోబల్ ఐకాన్ గా ఎదిగిన తరువాత ప్రధానమంత్రిని ఓసారి పలకరించడం మర్యాద కదా.అందుకే నిన్న వెళ్ళి నరేంద్ర మోడిని కలిసింది.అయితే ఈ మీటింగ్ వివాదస్పదమైంది.
వారిద్దరి మధ్య ఎలాంటి వివాదస్పదమైన చర్చ జరగలేదు.అయినా వివాదం ఎలా పుట్టింది అంటే ప్రియాంక వేసుకున్న డ్రెస్ వలన.ప్రియాంక స్కర్ట్ వేసుకోని ప్రధానిని కలిసింది.అంతే, సోషల్ మీడియా భగ్గుమంది, కొన్ని హిందూ సాంప్రదాయ సంఘాలు కూడా మండిపడ్డాయి.
ఎంత హాలివుడ్ కి వెళ్తే మాత్రం, ఇండియా వచ్చినప్పుడైనా ఇక్కడి అమ్మాయిలా ఉండాలి కదా, ప్రధానమంత్రిని కలుస్తూ స్కర్ట్ వేసుకోవడం ఏమిటి, అదికూడా అంత వయసున్న పెద్దాయన ముందు అంటూ ఓ వర్గం వారు వాదిస్తోంటే, ప్రధాని దేశవిదేశాలు తిరుగుతాడు, ప్రతీచోట ఆయన ముందుకి స్త్రీలు చీర కట్టుకోని రారు, ప్రియాంక ఒక హీరోయిన్, ఇప్పుడు ఒక గ్లోబల్ ఇమేజ్ ఉన్న నటి, అలాంటి నటి ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చే బట్టలే వేసుకుంటుంది కాని, ప్రధాని కాబట్టి చీర కట్టుకోని వెళ్ళదు కదా అని మరో వర్గం వాదిస్తోంది.






