అనుష్కకి కోపం .. ప్రభాస్ మౌనం

ఈ తరం నటీనటుల్లో “జోడి” అనే పదం వినగానే మనకు గుర్తొచ్చే పేర్లు ప్రభాస్ – అనుష్క.బిల్లా, మిర్చి, బాహుబలి సీరీస్ .

 Anushka Disappointed With The Rumors .. Prabhas Still Silent-TeluguStop.com

నాలుగు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య చాలా స్నేహం ఉంది.కాని స్నేహానికి మించి ఇంకేదో ఉందని చాలామందికి అనుమానం.

అందుకే ప్రభాస్ – అనుష్క పెళ్ళి చేసుకుంటున్నారని రోజుకో పత్రిక వార్తలు రాస్తోంది.వీరిద్దరు పెళ్ళి చేసుకుంటేనే బాగుంటుందని సీనీ అభిమానులు కోరుకుంటున్నారు.

దాంతో వీరి పెళ్ళి రూమార్లు డైలీ రొటీన్ అయిపోయాయి.అయితే ఈ విషయం అనుష్కకి నచ్చడం లేదట.

కేవలం తెలుగు మీడియా మాత్రమే కాదు, ఇటు మిగితా దక్షిణాది రాష్ట్రాల మీడియా, అటు జాతీయ మీడియా అనుష్క – ప్రభాస్ పెళ్ళి అంటూ అదేపనిగా డబ్బా కొడుతున్నాయి.నిజంగానే వీరిద్దరికి పెళ్ళి జరుగుతుందా లేదా ఏమి ఆరా తీయకుండా ఓ ప్రఖ్యాత మ్యాగజీన్ కూడా ప్రభాస్ – అనుష్క పెళ్ళి అంటూ కథనాలు రాస్తోంది.

దాంతో అనుష్క బాగా సీరియస్ అయిపోయిందట.ఆ మ్యాగజీన్ వారితో మాట్లాడమని, అడిగి తెలుసుకోకుండా ఏమి రాయొద్దని చెప్పమని తన పీఆర్ టీమ్ కి ఆదేశించిదట.

అయినా, ఇలా ఎవరికి తెలియకుండా మీడియాని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసి ఏం లాభం ? సింపుల్ గా, పబ్లిక్ గానే ఇది రూమర్ .మాకు పెళ్ళి జరగట్లేదు, మేం కేవలం స్నేహితులం అని స్వయంగా చెప్పేస్తే సమస్య తీరిపోతుంది కదా.

అనుష్క కనీసం ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం అయినా చేసింది.కాని ప్రభాస్ ఆ ప్రయత్నం కూడా చేయకుండా మౌనంగా ఉన్నాడు.

ఇద్దరు ఎందుకు రూమర్ ని ఖండిచట్లేదు ? పెళ్ళి విషయం మీద ఇంకా ఆలోచిస్తున్నారా ? ఇదిలా ఉంటే ప్రభాస్ కి భీమవరంలో అమ్మాయిని చూసారని టాక్ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube