గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ వచ్చి, కొన్నిరోజులు ఉద్యోగం చేసి, అది మానేసి కొన్నిరోజులు న్యూస్ రీడర్ జాబ్ చేసి, మధ్యమధ్యలో చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే, జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో నెం.1 యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఈరోజు అనసూయ అంటే ఓ బ్రాండ్.
ఆడియో ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేసేందుకు కూడా లక్షలు చెల్లిస్తున్నారు నిర్మాతలు.ఐటమ్ సాంగ్ ఆఫర్లు వస్తున్నా, సినిమా ఆఫర్లు పిచ్చిపిచ్చిగా వస్తున్నా, తనకు నచ్చింది ఒప్పుకోని, మిగితావి పక్కనపెట్టే స్టేజిలో ఉంది అనసూయ.
కాని ఇదంతా కష్టపడకుండానే రాదు కదా.
అనసూయ ఈ స్టేజి దాకా రావడానికి చాలా కష్టపడిందట.మానసికంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొందట.తన ఇంట్లో ఎవరికి సినిమా ఇండస్ట్రీ మీద మంచి అభిప్రాయం లేదట.తన భర్తకి కూడా మొదట్లో ఇండస్ట్రీ అంటే అస్సలు నచ్చేది కాదట.అయినా, వారిని ఒప్పించి, పిల్లలకి తల్లిగా ఉంటూ, గ్లామర్ ఫీల్డ్ లో ఎదగడం మామూలు విషయం కాదు కదా.
ఇప్పటికి తను సెటిల్ అవలేదు అంటోంది అనసూయ.ఇంకా కష్టపడాలట.
మంచి పేరు తెచ్చుకోవాలట.ఓ పెద్ద ఇల్లు కట్టుకోని, వాకిట్లో కూరగాయలు పండిస్తూ, వాటినే వండుకోని తినడం తనకిష్టం అంట.ఆ కల నెరవేరేవరకు కష్టపడుతూనే ఉంటుందట.అలాగే తన కుటుంబానికి, తన భర్తకి ఇబ్బందికరంగా అనిపించే సినిమాలు ఎప్పుడూ చేయదట.
ఇక అఫైర్ల గురించి మాట్లాడుతూ, తాను చాలా నిజాయితీగా, తన పని మాత్రమే చూసుకుంటున్నా, తన మీద పుకార్లు పుట్టుకొస్తున్నాయని, మొదట్లో తనపై రాసే అబద్ధాలని చదివినప్పుడు బాధగా ఉండేదని, కాని రాను రాను అదంతా అలవాటు అయిపోయిందని, తన స్టేజిలో ఉండే ఏ సెలబ్రిటీకి అయినా ఇదంతా మామూలే అంటోంది అనసూయ.ఇక చివరగా, పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ వదిలేసి, సాయిధరమ్ తేజ్ సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ ఎందుకు చేసిందో చెప్పింది అనసూయ.
ఆ పాట “సూయ సూయ అనసూయ” అంటూ తన పేరు మీదే ఉండటంతో చేయాలనిపించిందట.







