అనసూయ – రష్మీ .బుల్లితెర హీరోయిన్లు.
ఇంకోమాట చెప్పాలంటే టీవీ ప్రపంచంలో సూపర్ స్టార్లు.అంతేగా, వీరి కోసమే టీవికి అతుక్కుపోయే తెలుగు రాష్ట్రాల ప్రజలు వేలమంది.
తమ సొగసులతో టీవి తెరకి గ్లామర్ అద్దిన సరికొత్త జెనరేషన్ యాంకర్లు వీరు.ఇద్దరు ఒకానొక దశలో సమానమే.
కాని ఇప్పుడు అలా కాదు, ఇటు టీవి తెరపై, అటు వెండితెరపై, రెండూ చోట్ల రష్మిని తెగ డామినేట్ చేస్తోంది అనసూయ.ముఖ్యంగా సినిమాల విషయంలో అనసూయకి పెద్ద సినిమాల ఆఫర్లు ఉంటే, రష్మీకి మాత్రం ఇంతకుముందు ఉన్న చిన్న సినిమాల ఆఫర్లు కూడా లేవు.
ఇలా ఎందుకు? అనసూయకి, రష్మీకి మధ్య ఇంత తేడా ఎందుకు వచ్చింది?
మాకు కనబడుతున్న కారణం మాత్రం సినిమాల ఎంపిక.అవును, రష్మీ ఎంచుకున్న సినిమాలే రష్మీ ఇమేజ్ ని దెబ్బతీసాయి.
రష్మీ మరీ ఓవర్ గ్లామరస్ గా మారడంతో అవకాశాలు తగ్గాయి.గుంటూరు టాకీస్ ఒక్కట్టే మనకి గుర్తు.
ఆ తరువాత డజను సినిమాల దాకా చేసింది రష్మీ.ఆ సినిమాల పేర్లు గుర్తుకులేవు ప్రేక్షకులకి.
హీరో ఎవరో, డైరెక్టర్ ఎవరో, ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియదు.మరి అనసూయ చేసిన సినిమాలు?
క్షణం, సోగ్గాడే చిన్నినాయన, ఇలా సెలెక్టీవ్ గా సినిమాలు చేసింది అనసూయ.కేవలం గ్లామర్ షోతోనే నిలబడటం కష్టం, ఒక సినిమా చేస్తే, ఆ సినిమాకి ఓ రెంజ్ ఉండాలి, ఆ సినిమా వలన బ్రాండ్ వాల్యూ పెరగాలే తప్ప, తగ్గుకూడదు అని అర్థం చేసుకుంది అనసూయ.అందుకే, ఎక్కువ షోలు, ఎక్కువ పారితోషికం, ఆడియో ఫంక్షన్లు, పెద్ద సినిమాలు .అన్నీ అనసూయ దగ్గర ఉన్నాయి.సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడు కూడా రామ్ చరణ్ సినిమాలో అనసూయకి ఓ ముఖ్య పాత్రని ఇస్తున్నాడంటే, అనసూయ క్షణం ఒప్పుకోని, గ్లామర్ ని కాకుండా తన టాలెంట్ ని నమ్ముకోవడం ఎంత ఉపయోగపడిందో ఆలోంచించండి.