రోజుకి ఎన్ని గంటలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం ? ఎప్పుడైనా గమనించారా ? పొద్దున్న లేవగానే చేతులు దానిమీదకే వెళతాయి, చాలామందికి ఇప్పుడు బాత్ రూమ్ లో కూడా సెల్ ఫోన్ కావాలి, ఫేస్ బుక్ మీద కాసేపు, ట్విట్టర్ మీద కాసేపు, వాట్సాప్ మీదా కాసేపు, ఇతర బ్రౌజింగ్ మీద కాసేపు, ఇక ఇంటరెస్ట్ ఉంటే గేమ్స్, సినిమాలు, అటు చేసి ఇటు చేసి, రోజుకి కనీసం 4-5 గంటలు అయినా స్మార్ట్ ఫోన్ మీద బ్రతికేస్తున్నాడు మనిషి.కనీసం అన్నాం కాబట్టి ఈ లెక్క ఇంకా పెరగవచ్చు.కాని ఇలా విపరీతమైన స్మార్ట్ ఫోన్ వాడకం వలన మీ శరీరానికి మీరు ఎంత హాని చేసుకుంటున్నారో ఆలోచించారా ? స్మార్ట్ ఫోన్ వాడటం తగ్గిస్తే ఎంతవరకు మీ శరీరం, మనసు ఎంత బాగుపడతాయో తెలుసా ?
*గంటలకొద్దీ తలదించి స్మార్ట్ ఫోన్లో తలదూరుస్తాం .4 -5 కేజిలా తలబరువు శరీరంపై 18 కిలోలా బరువు ఒత్తిడి తీసుకొస్తుంది.వెన్నుముక్క నుంచి తలపైభాగం దాకా ఎంత ఒత్తిడి ? స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించి చూడండి .ఎంత ఒత్తిడి తగ్గుతుందో.
* అప్పుడప్పుడు మెడ కండరాలు పట్టేసినట్టుగా అనిపిస్తుంది కదా ? ఇదే కదా అతిపెద్ద సమస్య.Occipital Neuralgia లాంటి నరాల సమస్యని పోలిన సమస్య ఇది.అదే మీరు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించారనుకోండి, మీ నరాలను బ్రతికించుకున్నవారవుతారు.
* వెన్ను నొప్పి, నడుం నొప్పి … ఇవి కూడా ప్రధాన సమస్యలే.
చెబుతున్నాం చూడండి .ఈ కాలం పిల్లలు 30 దాటగానే ఈ సమస్యలన్నీ చూస్తారు.అందుకే మీరు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించి, వారిని కూడా తగ్గించమని చెప్పండి.
* స్మార్ట్ ఫోన్ అతిగా వాడేవాళ్ళే ఒంటరితనాన్ని బాగా ఫీల్ అవుతారని ఎన్నో పరిశోధనలు చెప్పాయి.అవన్నీ నిజాలే.స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గిస్తేనే కదా నలుగురితో కలిసేది, నలుగురితో మాట్లాడేది.
* స్ట్రెస్, నిద్రలేని, తలనొప్పి .ఇవన్ని స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్న చిక్కులే, ఈ చిక్కులనుంచి బయటపడాలంటే, స్మార్ట్ ఫోన్ వ్యామోహం నుంచి బయటపడాలి.రేడియేషన్ నుంచి బయటపడాలి, తద్వారా ఆలోచన శక్తి తగ్గకుండా మెదడుని కాపాడుకోవాలి, బ్రెయిన్ క్యాన్సర్ నుంచి దాన్ని రక్షించుకోవాలి.ఇలా చెప్పుకుంటూ పొతే, అన్ని లాభాలే, స్మార్ట్ ఫోన్ వాడకాన్ని కాస్త తగ్గించి చూడండి.