ప్రియాంక చోప్రా మాజీ ప్రపంచ సుందరి అన్న విషయం మనందరికి తెలిసిందే.అప్పట్లో ఆమె అందాన్ని పొగడని వారు లేరు.
భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిందని కూడా వ్యాసాలు రాశారు.కాని ఓ నిర్మాత మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడట.
ఓ అమెరికన్ టాక్ షోలో పేరుమోసిన మహిళలంతా మాట్లాడుతున్నారు.టాపిక్ ఏంటి అంటే, స్త్రీ శరీరంపై వచ్చే విమర్శలు.ఆ టాక్ షోలో మాట్లాడుతూ ప్రియాంక తనకి ఎదురైన చెదు అనుభవాల్ని చెప్పింది.
“నటిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ నిర్మాతని కలిసాను.అప్పటికే నేను ప్రపంచ సుందరి కితాబు గెలుచుకున్నాను.కాని ఆ నిర్మాత నా ముక్కు బాగాలేదు, నా బాడి షేప్ బాగా లేదు అని కామెంట్స్ చేసాడు.
నా గురించి అంతా తప్పుగా మాట్లాడాడు.సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిల ఫిగర్ కొంచెం కొలతలు మారినా చాలు, అవమానకరమైన కామెంట్స్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.
అంతా ఒకే కాని, అదే ఊపులో తన ముక్కు ఒరిజినల్ అని, సర్జరీ చేయించుకోలేదని చెప్పింది.ఒంటికి చాలా సర్జరీలే చేయించుకున్న ప్రియాంక, తన ముక్కు ఆకారాన్ని కూడా మార్చుకుందని మొత్తం బాలివుడ్ చెబుతుంది, మరి ఈవిడ హాలివుడ్ జనాలకి ఇదంతా తెలియదు కదా అని అబద్ధం చెప్పిందా?
.






