ఆ భ‌య‌మే శ‌శిక‌ళ‌ను సీఎం చేసిందా..!

త‌మిళ‌నాట సీఎం కుర్చీ చుట్టూ తిరిగిన అనూహ్య ప‌రిణామాల‌కు ఆదివారం తెర‌ప‌డింది.ఎప్ప‌టినుంచో అనుకుంటున్న‌ట్టుగానే సీఎం సీటును మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళా న‌ట‌రాజ‌న్ సొంతం చేసుకున్నారు.

 Sasikala Elected Aiadmk Legislature Party Leader-TeluguStop.com

వాస్త‌వానికి జ‌య డిసెంబ‌రు 5న క‌న్నుమూసిన త‌ర్వాత నుంచి ఆమె స్థానంలో ఎవ‌రు కూర్చుంటార‌నే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది.అయితే, ఎప్ప‌ట్లాగే.

ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న అమ్మ‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన ఓ ప‌న్నీర్ సెల్వానికి అప్ప‌ట్లో అమ్మ ప‌ద‌వి ద‌క్కింది.

అయితే, సెల్వం శాశ్వతం కాద‌ని, అమ్మ సీటు చిన్న‌మ్మ‌కేన‌ని భారీగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, దీనిని వ్య‌తిరేకిస్తూ కూడా కొన్ని వ‌ర్గాలు గ‌ళం విప్పాయి.జ‌య‌ను అడ్డం పెట్టుకుని బ‌తికిన వాళ్ల‌కు ఆమెను సీటులో కూర్చునే అర్హ‌త లేద‌ని పెద్ద విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

దీంతో అప్ప‌ట్లో సైలెంట్‌గా ఉండిపోయిన శ‌శిక‌ళ .తాజాగా మాత్రం సీఎం సీటు కోసం పావులు వేగంగా క‌దిపారు.దీనికి రాష్ట్రంలో గ‌త నెల, ఈ నెల జ‌రిగిన ప‌రిణామాలే కార‌ణంగా క‌నిపిస్తున్నాయి.వాస్త‌వానికి జ‌య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆర్ కే న‌గ‌ర్‌లో పోటీ చేసి.గెలిచాక సీఎం సీటును స్వాధీనం చేసుకుందామ‌ని చిన్న‌మ్మ భావించింద‌ట‌.

అయితే, ప‌న్నీర్ సెల్వం దూకుడు చూస్తే.

ఆమెకు నిద్ర‌ప‌ట్ట‌లేద‌నే టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా త‌మిళ ప్ర‌జ‌ల సెంటిమెంట్ అయిన జ‌ల్లి క‌ట్టు విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించ‌డం స‌హా చెన్నైవాసుల‌కు తాగు నీటిని అందించేందుకు తెలుగు గంగ ప‌థ‌కంపై చంద్ర‌బాబుతో హుటాహుటాన అమ‌రావ‌తికి వ‌చ్చి ప‌న్నీర్ సెల్వం చ‌ర్చించిన తీరు ఆయ‌న పాల‌నా ప‌రంగా ప్ర‌జ‌ల్లో ముద్ర వేస్తున్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

దీంతో ఈ ప‌రిణామం చిన్న‌మ్మ‌కు మింగుడు ప‌డ‌లేదు.ప‌న్నీర్ ఇదే ఊపుతో ప్ర‌జ‌ల గుండెల్లో పాతుకుపోతే.

త‌నకు సీఎం సీటు కాదు క‌దా.ఏసీటూ ద‌క్క‌ద‌ని భావించార‌ట‌.

ఈ క్ర‌మంలోనే హుటా హుటిన సీఎం సీటును ద‌క్కించుకునే చ‌ర్య‌ల‌కు పదును పెట్టార‌ట చిన్న‌మ్మ‌.నిన్న మొన్న జ‌రిగిన ప‌రిణామాలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఆదివారం భేటీ అయిన అన్నాడీఎంకే నేత‌లు.అసెంబ్లీ ప‌క్ష నేత‌గా చిన్న‌మ్మ‌ను ఎన్నుకున్నారు.

వాస్త‌వానికి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ప‌న్నీర్‌కి ఇష్టం లేద‌నే ప్ర‌చారం జ‌రిగింది.కానీ, ప‌న్నీర్ అలా వ్య‌వ‌హ‌రించ‌కుండా చాలా సౌమ్యంగా శ‌శిక‌ళ పేరును ప్ర‌తిపాదించార‌ట‌.

దీంతో రేపో మాపో.త‌మిళ‌నాడు మంత్రి.

శ‌శిక‌ళ అనే హెడ్డింగులు క‌నిపించ‌నున్నాయి!! సో.ఇదీ చిన్న‌మ్మ రాజ‌కీయం!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube