దురదను తగ్గించే అద్భుత పదార్థాలు మీకోసం

దురద చాలా భయంకరమైన సమస్య.దురదపై మన గోళ్ళు పడినాకొద్ది అది పెరిగిపోతూనే ఉంటుంది.

 Best Home Remedies For Skin Itching-TeluguStop.com

ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ని తీసుకువస్తుంది.జిడ్డులాంటి సమస్య ఇది.అంత త్వరగా పోదు.కారణాలు అనేకం.

రక్తంలో ఇన్ఫెక్షన్ వలన కూడా కావచ్చు.డాక్టర్ ని ఎలాగో సంప్రదించాలి.

కాని మీవంతు ప్రయత్నంగా ఇంట్లో ఇవి వాడండి.

* తులసి ఆకులలో థైమాల్, కామ్ఫార్, యుజేనాల్ అనే పదార్థాలు ఉండటం వలన ఇది దురదని తగ్గిస్తుంది.

తాజాగా ఉండే తులసి ఆకులని దురదగా ఉన్న ప్రదేశంలో రాసుకున్న ఫర్వాలేదు లేదంటే మరుగుతున్న నీటిలో తులసి ఆకులు వేసి, కొంచెం చల్లబడ్డాక కాటన్ తో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకున్న ఫర్వాలేదు.

* కొబ్బరినూనె కూడా దురదపై బాగా పనిచేస్తుంది.

ఏమి కలపకుండా డైరెక్టుగా కొబ్బరినూనె దురద ఉన్న చోట కాటన్ తో రాయండి.

* హానికరమైన కెమికల్స్ లేని పెట్రోలియం జెల్లి కూడా దురదపై అద్భుతంగా పనిచేస్తుంది.

* డాక్టర్లు మెచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటి సెప్టిక్, యాంటి ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.రోజు కాటన్ తో వెనిగర్ ని తీసుకొని దురదపై రాస్తూ ఉండండి.

మార్పు కనిపిస్తుంది.

* మంటగా ఉన్న, ఓర్చుకొని నిమ్మరసం ఉపయోగిచాల్సిందే.

విటమిన్ సి ఉండటం వలన ఇది మీ దురదను తగ్గిస్తుంది.కాటన్ ఉపయోగించండి.

చేతులు వద్దు.

* కలబంద చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా చర్మంపై ఉన్న దురదపై దాడి చేస్తుంది.

అలోవేరా జెల్లి మీదకి మార్కెట్ లో దొరికే ఏ క్రీమ్ రాదు.

* ఇక చివరగా చెబుతున్న అతి ముఖ్యమైన విషయం .దురదపై మీ చేతులు, గోళ్ళు పడితే అది ఇంకా ఎక్కువే అవుతుంది.తాకడం, గోకడం మానేస్తే అదే తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube