ఎట్టకేలకు నాని నటించిన “నేను లోకల్” ఫిబ్రవరి 3వ తేదిన విడుదల అవుతోంది.ఎట్టకేలకు ఎందుకు అన్నాం అంటే, ఈ సినిమా నిజానికి డిసెంబర్ లో విడుదల కావాల్సింది.
మరి ఎందుకు కాలేదు అంటారు? షూటింగ్ పూర్తవడంలో ఆలస్యం జరగడం వలన.మరి ఆలస్యం ఎందుకు జరిగిందంటారు? కీర్తి సురేష్ వలన.
కీర్తి సురేష్ చేతిలో ఒకేసారి అయిదారు ప్రాజెక్ట్స్ ఉండటం వలన డేట్స్ సమస్య వచ్చింది.దాంతో నేను లోకల్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేక వాయిదా వేసుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కి, త్రివిక్రమ్ కి ఈ టాపిక్ తో ఏంటి సంబంధం అని అనుమానపడుతున్నారా?
కాటమరాయుడు తరువాత త్రివిక్రమ్ తో పవన్ ఓ సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్.
అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు మామూలుగానే సమయానికి పూర్తి కావు.పవన్ కొన్నిరోజులు రాజకీయాలకు, కొన్నిరోజులు సినిమాలకి కేటాయిస్తాడు కాబట్టి సినిమా ఆలస్యం అవడం ఖాయం.
ఇక అత్యంత బీజి హీరోయిన్ గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్ హీరోయిన్ అంటే, షూటింగ్ లో ఇంకెంత ఆలస్యం జరుగుతుందో ఆలోచించండి.అందుకే అంటున్నాం, ఇటు పవన్ కళ్యాణ్ వలనే కాదు, అటు కీర్తి సురేష్ వలన కూడా త్రివిక్రమ్ కి తిప్పలు తప్పేలా లేవు.







