గత బుధవారం నాడు షారుఖ్ ఖాన్ రయూస్, హృతిక్ రోషన్ కాబిల్ (తెలుగులో బలం) రెండూ విడుదలయిన సంగతి తెలిసిందే.రెండు పెద్ద చిత్రాలు ఒకేరోజు విడుదల కావడంతో ఇద్దరు పోటాపోటిగా కలెక్షన్లు రాబడుతారని అంతా భావించారు.
కాని షారుఖ్ డామినేషన్ ఎక్కువైపోయింది.
తొలి అయిదు రోజుల్లో రయీస్ 92 కోట్ల నెట్ వసూళ్ళు రాబడితే, హృతిక్ కాబిల్ మాత్రం 54 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.ఈ పరిస్థితి ముందే పసిగట్టిన హృతిక్ రోషన్ ఆండ్ క్యాంప్, తొలిరోజు నుంచే కలెక్షన్లు పెంచి చెబుతున్నారని షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, బాలివుడ్ ట్రేడ్ వర్గాలు కూడా మండిపడుతున్నాయి.
54 కోట్లు ట్రేడ్ లెక్కల్లో వస్తే, 70 కోట్ల దాకా వచ్చినట్లు హృతిక్ అండ్ టీమ్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇలా చేస్తే నిజాలు జనాలకి తెలియకుండా పోవు, ఇక్కడ ఎవరి పరువు పోతోందో చూసుకోవాలి అని బాలివుడ్ క్రిటిక్స్ సైతం తిట్టిపోస్తున్నారు.
మరి జెంటిల్మెన్ ఇమేజ్ ఉన్న హృతిక్ రోషన్ లాంటి హీరో ఇలా ఎందుకు చేస్తున్నాడనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు.ఈ బాక్సాఫీస్ గొడవ షారుఖ్, హృతిక్ బాగా పర్సనల్ గా తీసుకున్నారట.
హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ బహిరంగంగానే షారుఖ్ పై విమర్శలు చేయడం గమనార్హం.
హృతిక్ కి పోటీదారులు బాలివుడ్ కలెక్షన్ల రారాజులు ఆమీర్, సల్మాన్ తప్ప షారుఖ్ కాదని రాకేష్ కింగ్ ఖాన్ ని అవమానించారు లేండి.
ఇప్పుడేమో రెండు చిత్రాల మధ్య తేడా తగ్గించేలా ఇలా ఫేక్ కెలెక్షన్లు రిపోర్టు చేస్తున్నారట.







