ప‌రిటాల ర‌వి ఫ్లెక్సీల‌పై టీడీపీలో ఫైటింగ్‌

ఏపీలో అధికార టీడీపీలో ఫైటింగ్‌ల‌కు కొద‌వ‌లేదు.ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష పార్టీల‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ వ‌రుస‌పెట్టి సైకిలెక్కించుకుంది.

 Flexi War Between Tdp Leaders In Anantapur-TeluguStop.com

దీంతో ఇప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యేల చేతుల్లో ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు కొత్తగా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల‌కు ఓ రేంజ్‌లో ఫైటింగ్ జ‌రుగుతోంది.దీంతో పాటు పాత నేత‌ల మ‌ధ్య కూడా ఆధిప‌త్యం కోసం గొడ‌వ‌లు షురూ అవుతున్నాయి.

టీడీపీకి కంచుకోట‌లాంటి అనంత‌పురం జిల్లాలో ఇప్పుడు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరుకుంది.వారిద్ద‌రు ఉప్పునిప్పులా ఉంటున్నారు.

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు ఎమ్మెల్యే టీడీపీ వాళ్లంతా సింహంలా భావించే మాజీ మంత్రి, దివంగ‌త టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల ర‌వీంద్ర ఫ్లెక్సీ సైతం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పెట్టే వీలులేద‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్టు వార్త‌లు రావ‌డం జిల్లా రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

అనంత‌పురం జిల్లాకు చెందిన దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర పేరు చెపితే చాలు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు పూన‌కంతో ఊగిపోతారు.

అలాంటి ప‌రిటాల ర‌వీంద్ర ఫ్లెక్సీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పెట్ట‌డానికి వీలు లేదంటూ ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి ఆదేశాలిచ్చారని వార్త‌లు వ‌స్తున్నాయి.ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో త‌మ ఫ్లెక్సీలు ఉండాల‌నేది ప‌రిటాల వ‌ర్గం కోరిక‌గా తెలుస్తోంది.

అయితే స్థానిక ఎమ్మెల్యే సూరి మాత్రం నా నియోజ‌క‌వ‌ర్గంతో మీకు ప‌నేంట‌ని…ర‌వి ఫ్లెక్సీలు ఇక్క‌డ పెట్ట‌డం కుద‌ర‌ద‌ని చెపుతున్నాడ‌ట‌.

గ‌తంలో కూడా ఇక్క‌డ ఫ్లెక్సీల ఏర్పాటు విష‌యంలో ఇటు మంత్రి సునీత వ‌ర్గీయులు, అటు సూరి వ‌ర్గీయులు ఇద్ద‌రూ ప‌ట్టుబ‌డుతుండ‌డంతో చివ‌ర‌కు పోలీసులు జోక్యం చేసుకుని 144 సెక్ష‌న్ విధించే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

ఇక ఇప్పుడు ప‌రిటాల ర‌వి వ‌ర్థంతి సంద‌ర్భంగా మ‌రోసారి ఈ రెండు వ‌ర్గాలు ఫ్లెక్సీల విష‌యంలో ఫైటింగ్‌కు దిగ‌డంతో మ‌రోసారి 144 సెక్ష‌న్ పెట్టాల్సి వ‌చ్చింది.

ర‌వి ఫ్లెక్సీల పేరుతో సునీత ఎక్క‌డ త‌న నియోజ‌క‌వ‌ర్గం మీద ప‌ట్టు సాధిస్తుందో అన్న భ‌యం సూరిలో ఉంది.

ఎందుకంటే సునీత వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను రాప్తాడు నుంచి పోటీ చేసి త‌న త‌న‌యుడు శ్రీరామ్‌కు ధ‌ర్మ‌వ‌రం టిక్కెట్టు ఇప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు మ్యాట‌ర్ లీక్ అయ్యింది.ఇదే ఇప్పుడు సూరిలో భ‌యానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

దీంతో ధ‌ర్మ‌వ‌రంలో ప‌రిటాల ఫ్లెక్సీ పెట్టేందుకు కూడా సూరి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు ఉద్రిక్తంగా మారి చివ‌ర‌కు ప‌రిస్థితి 144 సెక్ష‌న్ వ‌ర‌కు వెళ్లింది.మ‌రి ఈ వివాదం ఎలా ట‌ర్న్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube