రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు

టీవి యాంకర్ గా ఫామ్ లో ఉండగా, గేరు మార్చి “గుంటూరు టాకీస్” లో అందాల ఆరబోతతో అందరిని ఆశ్చర్యపరిచింది రష్మీ.ఆ సినిమా వలన తనకి ఐటం సాంగ్ ఆఫర్స్ ఎక్కువ వస్తాయని అప్పట్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.

 Rashmi Lost Item Song Offer To Hamsa Nandini-TeluguStop.com

ఐటం సాంగ్ ఆఫర్స్ అయితే వచ్చాయి కాని, పెద్ద హీరోల సినిమాల్లో కాదు.పోని, పెద్ద సినిమాల్లో మంచి పాత్రలేమైనా వచ్చాయా అంటే, అదీ లేదు.

కేవలం స్కిన్ షో మీదే ఆధారపడి చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో రష్మీ క్యాలెండర్ ఖాలీ అయిపోయింది.తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలో రష్మీని ఐటం సాంగ్ కోసం అడిగారట.

కాని అమ్మడు మరీ ఎక్కువ కాసులు డిమాండ్ చేయడంతో, ఆ ఆఫర్ కూడా వెనక్కిపోయిందని సమాచారం.

ఇప్పుడు ఆ సినిమాలో రష్మీకి బదులు “మిర్చి” ఐట గర్ల్ హంస నందిని రాజ్ తరుణ్ తో కలిసి గంతులేయబోతోందట.

రాకరాక వచ్చిన ఆఫర్ ని ఇలా పోగొట్టుకుంది రష్మీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube