ఎన్టీఆర్ కెరీర్ లో ఎందుకు లో ఫేజ్ చూసాడు? యూనివర్సల్ సినిమా, అంటే అన్నివర్గాల ప్రేక్షకులని అలరించే సినిమాలు చేయకుండా రెగులర్ మాస్ సినిమాలు అదేపనిగా చేసుకుంటూ పోవడం వలన.ఏదైతే ఏం, ఎన్టీఆర్ ట్రాక్ లో పడ్డాడు.
రామ్ చరణ్ కూడా అంతే.రామ్ చరణ్ కూడా ఇప్పుడు ట్రాక్ లో పడే పనిలోనే ఉన్నాడు.అంతేకాదు, తను చేసిన తప్పుని కూడా ఒప్పుకున్నాడు.
“ఈమధ్య కాలంలో మంచి పాత్రలని ఎంచుకోవడంలో విఫలమయ్యాను.నన్ను నేను ప్రతి ఫ్రేమ్ లో చూసుకోవాలనుకోవడం ముఖ్యమైన విషయం కాదు.నా అభిమానులు సినిమా మొత్తం నన్నే చూడాలనుకుంటారు.కాని హీరో ఇమేజ్ కథని చెడగొట్టకూడదు.నా అభిమానులు మంచి సినిమా చూడాలని రావాలి, నన్ను మాత్రమే కాదు.
అలా జరగకపోతే నన్ను వారు ఎక్కువకాలం అభిమానించలేరు” అంటూ సూటిగా చెప్పేశాడు చెర్రి.
మరి ధృవతో చరణ్ లో వచ్చిన మార్పు ఎంతకాలం ఉంటుందో, రామ్ చరణ్ నుంచి భవిష్యత్తులో విభిన్నమైన కథలు, పాత్రలు వస్తయో లేదో చూడాలి.







