అల్లు అర్జున్ కొత్తగా చేస్తున్న చిత్రం డిజే-దువ్వాడ జగన్నాథం.హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
దిల్ రాజు నిర్మాత.ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈమధ్యే మొదలైంది.
ఇక ఈ సినిమాలో రెండొవ హీరోయిన్ క్యారెక్టర్ కోసం టీవి యాంకర్ శ్రీముఖిని అనుకున్నారని, కాని జులై సినిమాలో తనకి చెల్లిగా నటించిన శ్రీముఖిని ఇప్పుడు హీరోయిన్ గా పెట్టడం ఏంటని అల్లు అర్జున్ శ్రీముఖిని రిజెక్ట్ చేసాడని వార్తలు వస్తున్నాయి.అయితే ఇవన్ని పుకార్లే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటివరకు హరీష్ శంకర్ – బన్ని మధ్య శ్రీముఖి గురించి ఎలాంటి చర్చ జరగలేదట.
అయినా బన్ని లాంటి స్టార్ హీరో సరసన యాంకర్ ని హీరోయిన్ గా పెట్టడం కొంచెం రిస్కీ విషయమే.
ఆ మాత్రం ముందుజాగ్రత్త దర్శకుడికి ఉంటుందిగా.మీడియా సృష్టించే గాలివార్తల్లో ఇది కూడా ఒకటి అన్నమాట.







