తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నటుడు అక్కినేని నాగార్జున సెంటరాఫ్‌ది ఎటాక్‌గా మారాడు.శుక్రవారం ప్రారంభమైన టీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యే.
రేవంత్ రెడ్డి నాగార్జున విషయంలో ఓ రేంజ్‌లో రెచ్చపోయి మరీ మాట్లాడారు.భూ ఆక్రమణలకు పాల్పడుతున్న నాగ్.
ఆదర్శం ఎలా అవుతాడని రేవంత్ ప్రశ్నించారు.నాగార్జున భూ ఆక్రమణలపై ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన రేవంత్.
నాగ్ విషయంలో చాలా సీరియస్‌గా స్పందించారు.నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపించారు.
ఈ ఆక్రమణలపై ప్రభుత్వం స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.పోనీ నాగార్జున ఏమైనా సమాధానం చెబుతాడేమోనని అనుకున్నా ఆయన కూడా స్పందించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఏ శక్తులు అడ్డుపడుతున్నాయో చెప్పాలని కేసీఆర్ సర్కార్ ను రేవంత్ డిమాండ్ చేశారు.ఈ విషయంపై సభలో పెద్ద ఎత్తున ఆసక్తి ఏర్పడింది.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.ఎన్ కన్వెన్షన్ హాల్ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని, మున్సిపల్ శాఖ మంత్రి, జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
అంతేకాకుండా, పూర్తి సమాచారం అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు వెల్లడించారు.దీంతో రేవంత్ కొంతమేరకు శాంతించారు.
అయితే, గతంలోనూ నాగ్‌పై రేవంత్ రెచ్చిపోయారు.మాదాపూర్ లోని మూడెకరాల తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెషన్ సెంటర్ ను నిర్మించారని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వానికి నాగార్జున ప్రచారం చేసి, ఆయన హయాంలో ఆక్రమణలను రెగులరైజ్ చేయించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అదేవిధంగా రోడ్ నెం.2లోని అన్నపూర్ణ స్టూడియోస్ ను తక్కువ ధరలకు తీసుకున్న భూముల్లో నిర్మించారని, ఇప్పుడు మాత్రం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అందులో ఉన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్యార్ధులకు ఫీజుల రాయితీ ఇవ్వకపోవడం అన్యాయమని రేవంత్ ఆగ్రహించారు.అయితే, ఇప్పటివరకు నాగ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు?
.