రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి.ఏపీలో వైకాపా నుంచి టీడీపీలోకి, బీజేపీ నుంచి వైకాపాలోకి జంపింగ్‌ల పర్వం కొనసాగుతుంటే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు ఏర్పాటుపై ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి.
జేఏసీ కన్వీనర్ కోదండరాం ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతుందని నిన్నటి వరకు వార్తలు రాగా ఇప్పుడు మరో కొత్త పార్టీ ఏర్పాటుపై వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది.
తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో పార్టీలకు అతీతంగా కేసీఆర్‌కు ధీటైన ప్రత్యర్థిగా ఉన్నాడు.కేసీఆర్‌ను రేవంత్ ఎదుర్కొన్నట్టుగా ఏ పార్టీ నేత కూడా ఎదుర్కొనే సాహసం చేయడం లేదు.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు అనుగుణంగా రేవంత్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి ఆశించిన రాజకీయ వాతావరణం కనిపించడం లేదు.
పార్టీలో రేవంత్‌తో పాటు మిగిలిన ఒకరిద్దరు నాయకులు కూడా తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఆంధ్రాకు చెందిన టీడీపీలో ఉండడం కంటే తెలంగాణలో తన సామాజికవర్గంతో పాటు తనతో కలిసి వచ్చే ఇతర పార్టీల రాజకీయ నాయకులతో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాలనే యోచనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల తర్వాత రేవంత్ సైతం టీడీపీలో ఉంటే ఫ్యూచర్ లేదని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి రేవంత్‌కు ఆఫర్లు వచ్చినా వెళ్లలేదు.
ఇక ఇప్పుడు పై విధంగా తనకు ఉన్న కొత్త ఆలోచనలతో సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఇటీవల రేవంత్ తెలంగాణలో అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా.
అవన్నీ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేలా ఉన్నాయన్న చర్చలు నడుస్తున్నాయి.ఈ విషయంలో టీ టీడీపీ నేతలు రేవంత్‌పై ఫైర్ అవుతున్నారు.
రాజకీయ వర్గాలు మాత్రం రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు స్కెచ్‌లోనే ఇలా చేస్తున్నాడని చర్చించుకుంటున్నాయి.మరి రేవంత్ రూటు ఎలా మారుతుందో చూడాలి.







