పెరట్లోనే ఉంటుంది కాబట్టి జామ చులకన.జామపండ్లనే సరిగా పట్టించుకోనప్పుడు జామ ఆకులని ఏం పట్టించుకుంటారులేండి.
కాని పట్టించుకోవాలి.జామ ఆకులలో ఎన్ని అద్భుతాలు దాగున్నాయో తెలిస్తే మీరు తప్పకుండా పట్టించుకుంటారు.
* జామ ఆకులని నీళ్ళలో మరిగించి రోజూ తాగటం అలవాటు చేసుకుంటే బ్యాడ్ కొలెస్టిరాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.అలాగే డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు.
* లివర్ పనిచేసే తీరుని మెరుగుపరుస్తాయి జామ ఆకులు.జామాకు – నీరు .ఈ మిశ్రమాన్ని లివర్ టానిక్ అని కూడా అంటారు.
* కొన్నిసార్లు బయటి తిండి తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు.
అలాగే వాంతులు రావొచ్చు.అలాంటప్పుడు జామ ఆకులు పనిచేస్తాయి.
* జీర్ణక్రియ మెరుగుపడటానికి జామపండ్లే కాదు, జామ ఆకులు కూడా సహాయం చేస్తాయి.ఇందులో ఉండే ఎంజీమ్స్ మన కడుపుకి మంచి నేస్తాలు.
* డెంగ్యూతో బాధపడేవారికి జామ ఆకులు నీటిలో మరిగించి తాగిస్తే ఫలితం ఉంటుంది.జామ ఆకులు రక్తంలో ప్లేట్లేట్స్ సంఖ్య పెంచుతాయి.
* జామాకులు తరుచుగా తినటం వలన వీర్య ఉత్పత్తి కూడా మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు చెప్పాయి.
* గాయాలపై జామ ఆకులు పిండి ఆ పసరుని రాయడం వలన ఉపశమనం పొందవచ్చు.
ఎందుకంటే ఇందులో యాంటి బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి.
* చర్మం యొక్క అందానికి కూడా జామ ఆకులు పనిచేస్తాయి.
ఇవి మొటిమలు, మొటిమల వచ్చిన మచ్చలపై ప్రభావం చూపగలవు.అలాగే దురద లాంటి సమస్యని తగ్గిస్తాయి.