మన జక్కన్న చెక్కిన బాహుబలి ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద సినిమాగా ఎదిగిపోయింది.అదికూడా ఏ రేంజ్ కి అంటే, బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా బాహుబలి మీద ఆధారపడే రేంజ్ కి.
ఇంతకి షారుఖ్ ఖాన్ కి బాహుబలికి ఏంటి సంబంధం, అసలు రాజమౌళి సహాయం తీసుకోవాల్సిన అవసరం షారుఖ్ కి ఎందుకు వచ్చింది? ఇదే కదా మీ అనుమానం.
షారుఖ్ ఖాన్ తదుపరి సినిమా రయీస్ గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతోంది.
సరిగ్గా అదే జనవరి 26వ తేదినా హృతిక్ రోషన్ నటిస్తున్న కాబిల్ (తెలుగులో బలం) కూడా విడుదల అవుతోంది.ఈరకంగా ఇద్దరు పెద్ద హీరోలు ఒకేరోజు తలబడుతున్నారు.
ఇప్పుడు విషయం ఏమింటే, హృతిక్ మీద పైచేయి సాధించటం కోసం షారుఖ్ ఎక్కువ థియేటర్లు, ముఖ్యంగా ఎక్కువ సింగల్ స్క్రీన్స్ బుక్ చేసుకునే పనిలో పడ్డాడు.అదికూడా రయీస్ తీసుకుంటే, బాహుబలి రెండొవ భాగం కూడా మీకే ఇస్తామనే కండీషన్ తో.అదేంటి, బాహుబలి ఇప్పిస్తానని షారుఖ్ చెప్పడం ఏంటి, తనకేం హక్కు అని అనుకుంటున్నారా!
బాహుబలి రెండుభాగాల హిందీ హక్కులు కేవలం కరణ్ జోహర్ దగ్గరే లేవు.అనిల్ థందాని అనే మరో భాగస్వామి కూడా ఉన్నాడు.
ఇప్పుడు రయీస్ ని పంపిణీ చేసేది కూడా ఆయనే.అందుకే రయూస్ తీసుకుంటే, బాహుబలి కూడా మీకే ఇస్తామని హిందీ సింగల్ స్క్రీన్స్ ఓనర్స్ కి ఎర వేస్తున్నారు.
పాపం, ఆ థియేటర్ ఓనర్లు మాత్రం ఏం చేస్తారు .ఇప్పుడు బాహుబలి అందరికి అవసరమే.







