హీరోయిన్ ని ముట్టుకోవాలంటే హీరో చేతులు వణికాయి

తెర మీద చూడటానికి రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉంటాయి కాని, వాటిని షూట్ చేసేటప్పుడు మామూలు ఇబ్బంది ఉండదు నటించేవారికి.

చూట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉంటారు, వారి ముందు రొమాంటిక్ గా ఉండాలంటే కష్టమే.

అదీకాక, ఎవరితోనైతే రొమాంటిక్ సన్నివేశాలు చేయాలో, వారు ఎలా ఫీల్ అవుతున్నారో, కొంచెం మోతాదు ఎక్కువైనా ఏమవుతుందో అన్న టెన్షన్ కూడా ఉంటుంది.అలాంటిది తనకన్నా వయసులో పెద్ద హీరోయిన్ ని, ఐశ్వర్యరాయ్ లాంటి ఒక దిగ్గజ నటిని రొమాన్స్ చేయాలంటే రణబీర్ కపూర్ లాంటి యువనటుడికి కష్టమే కదా! వీరిద్దరు కలిసి "ఐ దిల్ హై ముష్కిల్" అనే సినిమాలో నటించిన సంగతి తెలిసింది.

దీంట్లో ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు లేవు కాని, కొంచెం ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించారు.ఆ సీన్స్ తీస్తున్న సమయంలో ఐశ్వర్యరాయ్ ని ముట్టుకోవాలంటే రణబీర్ చేతులు వణికాయంట.

"ఐశ్వర్యరాయ్ తో పనిచేయాలని తెలియగానే చాలా ఆనందపడ్డాను.కాని షూటింగ్ మొదలయ్యేసరికి టెన్షన్ మొదలైంది.

Advertisement

రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడైతే ఆమెని ముట్టుకోవాలంటే చేతులు వణికేవి.కాని ఐశ్వర్య నా భయాన్ని పోగొట్టింది.

ఆ తరువాత మెల్లిమెల్లిగా ఆమెతో బాగా కలిసిపోయాను.సీనియర్ నటి అనే ఆటిట్యూడ్ ఆమె దగ్గర అస్సలు లేదు" అంటూ ఐశ్వర్యరాయ్ తో నటించిన అనుభవాల్ని చెప్పుకున్నాడు రణబీర్.

Advertisement

తాజా వార్తలు