కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు? ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో ? ఇప్పుడు ఈ మూడు ప్రశ్నలే తెలుగు సినీ అభిమానుల మెదడులో మెదులుతున్నాయి.బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ఎలాగో ఏప్రిల్ 28న తెలిసిపోతుంది.
బాహుబలి పూర్తయ్యాక ప్రభాస్ పెళ్ళి ఎలాగో జరిగిపోతుంది.ఈ రెండు విషయాల పైన క్లారిటి ఉంది కాని, ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయం మీద ఇంకా క్లారిటి రావట్లేదు.
పూరి జగన్నాథ్ లేన్నట్టే అంట.ఇప్పుడు కొత్త ట్విస్టు ఏంటంటే, యువ దర్శకుడు అనీల్ రావిపుడి మళ్ళీ మరో కొత్త కథతో ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాడట.ఈ సినిమా స్క్రిప్టు ఎన్టీఆర్ కి నచ్చిందని, ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంప్ లో అనిల్ రావిపూడి ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తోంది.ఈ ప్రాజెక్టు పైన దిల్ రాజు కన్ను ఎప్పటి నుంచో ఉంది.
కాబట్టి ఎన్టీఆర్ సినిమా ఒకే చేస్తే, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడం దాదాపు ఖాయం.
చూద్దాం .ఈ వార్తా అయినా నిజమవుతుందో లేక, ఎన్టీఆర్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ – చందూ మొండేటి లాగా ఓ రెండు రోజులు చప్పుడు చేసి మాయమైపోతుందో.







