ఎన్టీఆర్ పై నకిలీ జర్నలిస్టు దాడి

టీవి 9 ఛానేల్ ని రెగ్యులర్ చూసే అలవాటు ఉంటే మీకు జాఫర్ అనే జర్నలిస్టు తెలిసే ఉండాలి.ఈ జాఫర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి, జనతా గ్యారేజ్ ఫేక్ కలెక్షన్లతో టాప్ 3 లోకి వచ్చింది, కర్ణాటకతోపాటు, అంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాల్లో బాగా ఫేక్ చేసారని ఓ ట్వీట్ కనబడింది.

 Fake Journalist Account Attacks Ntr-TeluguStop.com

అంతేకాదు, ఇకపై ఎన్టీఅర్ సినిమాల కథలన్ని రాజమౌళి వింటారని, రాజమౌళికి వక్కంతం వంశీ కథ నచ్చలేదు కాబట్టే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని మరో ట్వీట్ పడింది.ఎన్టీఆర్ పై ఇలా డైరెక్టుగా దాడి చేస్తున్నాడేంటి ఈ జర్నలిస్టు అని అందరు ఆశ్చర్యపోతుండగానే అసలు ట్విస్టు బయటపడింది.అది ఫేక్ అకౌంట్ అంట.

“గమనిక : ట్విట్టర్ లో నా పేరు మీద ఎవరో ఫేక్ అకౌంట్ క్రియట్ చేసి …వాళ్లకు పడని వారి పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు … అసలు ఈ అకౌంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు …ఈమేరకు ట్విట్టర్ కు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ….వాళ్ళు దర్యాప్తు మొదలు పెట్టారు …అవకాశం ఉంటే మీరు కూడా ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లాలని -మనవి” అంటూ టీవి 9 జాఫర్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు.

ఇలా ఫేక్ ఖాతాలు నటులపై దాడి చేయడం కొత్తేమి కాదు.

కొన్నిరోజుల క్రిందట మహేష్ బాబు యాక్టింగ్ మురుగదాస్ కి నచ్చట్లేదని ఇలాగే ఒక ఫేక్ వెబ్ సైట్ ప్రచారం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube