యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్.సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పటికే కలక్షన్స్ తో భీభత్సం సృష్టిస్తున్న ఈ సినిమా సక్సెస్ పట్ల ఫ్యాన్స్ తో సక్సెస్ మీట్ సెలబ్రేట్ ఏర్పాటు చేసుకున్నారు యంగ్ టైగర్.ఎమోషనల్ గా సాగిన ఎన్.టి.ఆర్ ప్రసంగం ఫ్యాన్స్ ను ఉత్సాహంలో నింపింది.
జనతా గ్యారేజ్ టైటిల్ ఏ రోజైతే పెట్టామో సినిమా సక్సెస్ ఆరోజే ఫిక్స్ అయ్యిందని.13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సక్సెస్ చాలా బాగుందని.మీ కళ్లలో ఈ ఆనందం చూడడానికి 13 ఏళ్లు పట్టిందని అన్నారు.ఇలాంటి గొప్ప సినిమా తనకు ఇచ్చినందుకు కొరటాల శివకు ఆజన్మాంతం ఋణపడి ఉంటానని అన్నారు ఎన్.టి.ఆర్.సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ తో అమ్మానాన్నలకు పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వగలిగానని అన్నారు.బ్రతికి ఉన్నంత కాలం మిమ్మల్ని ఆనంద పరచాడానికి ప్రయత్నిస్తా అంటూ యంగ్ టైగర్ ఎమోషనల్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది.







