సన్నిలియోన్ ని అలా అవమానించారట

సన్ని లియోన్ ఫోటోషూట్ కి డేట్స్ ఇస్తానంటే చాలు, లక్షల కట్టతో ముందుకొచ్చేస్తాయి మ్యాగజీన్లు, సన్నిలియోన్ సినిమాకి డేట్స్ ఇస్తానంటే కళ్ళకి అద్దుకుంటారు నిర్మాతలు.సన్ని ర్యాంప్ పై నడుస్తానంటే పోటిబడి డ్రెస్సులు డిజైన్ చేస్తారు డిజైనర్లు.అలాంటి సన్నిలియోన్ ని ఒకప్పుడు నువ్వు మోడలింగ్ కి పనికిరావు అని కామెంట్ చేసారట.

 Sunny Leone Was Called “too Fat” In Early Modelling Days-TeluguStop.com

“చిన్నప్పటి నుంచే మోడల్ కావాలని అనుకునేదాన్ని.18 సంవత్సరాల వయసు రాగానే ప్రయత్నాలు మొదలుపెట్టాను.కాని నేను చాలా లావుగా, పొట్టిగా ఉన్నానని అన్నారు.

వాళ్ళు చాలా కమర్షియల్ గా అలోచించారో లేక నా మీద ఆసక్తిగా అనిపించలేదో.వాళ్ళకి చెంపపెట్టు జవాబు ఏంటంటే, అదే లావుగా, పొట్టిగా ఉన్న అమ్మాయి ఇప్పుడు న్యూయార్క్‌ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై నడుస్తోంది” అంటూ ఇటీవలే న్యూయార్క్‌ ఫ్యాషన్ వీక్ లో హోయలుపోయిన సన్ని వ్యాఖ్యానించింది.

ఇక సినిమాల విషయాని వస్తే, ఈ హాట్ భామ ప్రస్తుతం బెఇమాన్ లవ్, టీనా & లోలో, తెరా ఇంతెజార్ అనే సినిమాలు చేస్తోంది.అంతేకాదు, షారుఖ్ రయీస్, అజయ్ దేవగణ్ బాద్షాహో మరియు సోనాక్షి సిన్హా నూర్ లో ప్రత్యేక పాత్రల్లో మెరిసిపోనుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube