సెన్షేషనల్ డైరక్టర్ సుకుమార్ తన సినిమాల గురించే కాదు బయట సినిమాల గురించి కూడా తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు.ఇక రేపు రిలీజ్ అవుతున్న అవసరాల శ్రీనివాస్ డైరెక్టెడ్ మూవీ జ్యో అచ్యుతానంద మూవీ సుకుమార్ ను ఏడిపించిందట.
అవసరాలతో కథ చెప్పించుకున్న సుక్కు ఆ కథ బౌండెడ్ స్క్రిప్ట్ తెప్పించుకుని చదివి ఏడ్చేశాడట.ఇప్పటికే ఆడియో రిలీజ్ నాడు రాజమౌళి సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అంటూ సినిమాపై అంచనాలను పెంచేశాడు.
ఇప్పుడు సుకుమార్ కూడా సినిమా గురించి తన కనీళ్లతో చెప్పేశాడట.అంతేకాదు ఈ సంవత్సరం చిన్న సినిమాల్లో ఇదో ట్రెండ్ సెట్టర్ అవుతుందని అన్నారట.
నారా రోహిత్, నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
అయితే సినిమా ట్రైలర్ లో చూపించినట్టు ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కాదు అన్నదమ్ముల మధ్య అనుబంధం కూడా హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.మరి సుక్కు మెచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటుందో చూడాలంటే మరో 24 గంటలు ఆగితే సరిపోతుంది.
.







