నాచురల్ స్టార్ నాని సినిమాలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్ర హీరో రాజ్ తరుణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట.అదేంటి నాని సినిమాలో గెస్ట్ రోల్ చేసేంత సీన్ వచ్చిందా రాజ్ తరుణ్ కి అంటే.
నాని హీరోగా ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను సినిమా వస్తుంది.అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అయితే సినిమాలో ఓ మూడు నిమిషాలు కనిపించే ఇంపార్టెంట్ రోల్ ఉందట.ఇక ఆ క్యారక్టర్ కోసం రాజ్ తరుణ్ ని ఒప్పించాడు దర్శకుడు విరించి వర్మ.
అది కాకా ఉయ్యాల జంపాల తర్వాత సెకండ్ సినిమా ఇదే కావడం చేత ఓ సెంటిమెంట్ గా రాజ్ తరుణ్ ని పెట్టాడని అంటున్నారు.ఇక ఉన్న ఆ మూడు నిమిషాల సీన్ అయినా సరే నానికి చాలెంజ్ చేసే సీన్ లా ఉంటుందట.
సో మొత్తానికి నాని, రాజ్ తరుణ్ ల అరుదైన కాంబినేషన్ తెరమీద చూడబోతున్నాం.ఇప్పటికే మజ్ను సాంగ్స్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయగా సాంగ్స్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
.






