స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ రేంజ్ ఫాంలో ఉన్నాడో తన సినిమా కలక్షన్స్ హడావిడి చూస్తే అర్ధమవుతుంది.సమ్మర్ లో సరైనోడు అంటూ స్మాషింగ్ హిట్ అందుకున్న బన్ని హరీష్ శంకర్ డైరక్షన్లో డిజె దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను సెలెక్ట్ చేశారని వినిపిస్తున్నా చిత్రయూనిట్ మాత్రం నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ హీరోయిన్ మెహెరిన్ కౌర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలో మహలాక్ష్మిగా మనసు దోచుకున్న మెహెరిన్ తర్వాత సినిమాల విషయంలో అంతగా స్పీడ్ గా ఛాన్స్ కొట్టేయలేదు.
మోడల్ నుండి హీరోయిన్ గా టర్న్ తీసుకున్న అమ్మడు మొదటి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్న మెహెరిన్ బన్ని సినిమా ఛాన్స్ నిజంగా దక్కించుకుంటే ఇక తిరుగు ఉండదని చెప్పాలి.
హరీష్ శంకర్ పకడ్బందీ స్క్రిప్ట్ తో వస్తున్న ఈ సినిమా బన్నిని మరో రేంజ్ కు తీసుకెళ్తుందని చిత్రయూనిట్ చెబుతుంది.







