గ్యారేజ్ లో కామెడీ నిల్ అట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ పై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ లో ఓ నేచర్ లవర్ గా జూనియర్ ఓ కొత్త క్యారక్టరైజేషన్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.

 Less Comedy For Ntr Janatha Garage-TeluguStop.com

కొరటాల శివ కంటెంట్ పవర్ ఏంటో ఇంతకుముందు రెండు సినిమాల్లో చూశాం అయితే ప్రత్యేకంగా జనతా గ్యారేజ్ కోసం ఎక్కువ కష్టపడ్డ దర్శకుడు కొరటాల శివ సినిమా బ్లాక్ బస్టర్ చేసి తారక్ అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వదలచాడు.

అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాలో కామెడీ తక్కువగా ఉంటుదని అంటున్నారు.

ఎంత కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అయినా ఆడియెన్స్ కాస్త రీ ఫ్రెష్ అవడానికి ఎంటర్టైన్ మెంట్ కచ్చితంగా ఉండాలి కాని కొరటాల మాత్రం సినిమా మొత్తం ఎక్కువ శాతం సీరియస్ మోడ్ లోనే తీసుకెళ్లాడట.సెప్టెంబర్ 2న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన జనతా గ్యారేజ్ త్వరలోనే సెన్సార్ కు వెళ్లనుంది.

సినిమా మొత్తం సీరియస్ కంటెంట్ ఉన్నా దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో అందిస్తే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా ఫలితం ఎన్టీఆర్ గ్యారేజ్ తో కొట్టబోయే కలక్షన్ల రికార్డుల గురించి మిగతా స్టార్ హీరోలకు కూడా భయం పట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube