మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా మూవీ టైటిల్ ఏదై ఉంటుందా అనే కన్ ఫ్యూజన్ ఫ్యాన్స్ లో ఉంది.కత్తిలాంటోడు, నెపోలియన్, లెనిన్ ఇలా చాలా రకాల టైటిల్స్ వినిపించినా ఫైనల్ గా చిరు 150వ సినిమా టైటిల్ ఖైది నెంబర్ 150గా పెట్టనున్నారట.
ఇక టైటిల్ పోస్టర్ ఎలా ఉండబోతుంది చిరు లుక్ గురించి విషయాలు ఆగష్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ లో తెలిసిపోతుంది.తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఓ పాత్ర ఖైదిగా ఉంటుంది కాబట్టి సినిమా టైటిల్ గా ఖైది నెంబర్ 150 అని ఫిక్స్ చేశారట.అదికాక ఖైది సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని ఖైది నెంబర్ 150వ చిరు 150వ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు.వి.వి.వినాయక్ డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.







