యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ జనతా గ్యారేజ్ ఆడియో నిన్న సాయంత్రం అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.సినిమాలో అసలు హీరోయిన్ సమంత ఈ ఆడియో వేడుకకు రాలేదు.
సమంత రాకపోడానికి కారణాలు ఏంటా అని ఆరా తీస్తే కాస్త ఒంట్లో బాలేదు ఫంక్షన్ మిస్ అవుతున్నా అంటూ తీరిగ్గా ట్వీట్ చేసింది.సమంత నిజంగానే సిక్ అయ్యి ఆడియోకి రాలేదా లేక వేరే కారణాలు ఏమైనా ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.
ఓ పక్క తన చివరి సినిమా జనతా గ్యారేజ్ అని ప్రచారం జరుగుతుంది.
మరి చివరి సినిమా ప్రచారంలో సమంత ఇలా డుమ్మా కొట్టడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.
సమంత మిస్ అయ్యే సరికి ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన నిత్యా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.నిత్యా సాధారణంగా ఏ ఆడియో ఫంక్షన్స్ కు అంతగా రాదు మరి జనతాకు సమంత రాదని తెలుసుకుని వచ్చిందో ఏమో గాని నిత్యా ఎప్పుడు కనిపించే దాని కన్నా కాస్త డిఫరెంట్ స్టైల్ తో ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది.
అయితే నిత్యా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసినా గ్యారేజ్ లో చిట్టి పొట్టి డ్రస్సులతో అలరించిన సమంత కూడా ఉంటే ఫ్యాన్స్ ఇంకా ఖుషి అయ్యుండే వారు.