క్రికేట్ ప్రేమికుల్లారా .. ఇదే అత్యద్భుతమైన క్రికేట్ మొబైల్ గేమ్

భారతదేశంలో క్రికెట్‌ ని అభిమానించని వారే తక్కువమంది ఉంటారు.అంతలా క్రికెట్ మనలోకి ఎక్కేసింది.

 World Cricket Championship 2 – Most Played Cricket Mobile Game Till Date-TeluguStop.com

అందుకే గల్లి గల్లికో క్రికేట్ టీమ్ ఉంటుంది.గల్లిలో లొల్లిపెడితే, వీడియో గేమ్ పట్టుకోని కూడా క్రికేట్ అడేస్తుంటారు.

కంప్యూటర్ లో క్రికెట్ గేమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.కాని మొబైల్ గేమ్స్ లో క్రికెట్ గేమ్స్ అంతలా ఫేమస్ కాలేదు.

అయితే తాజాగా చేసిన మార్పులు, చేర్పుల తరువాత “వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2” క్రికెట్ మొబైల్ గేమ్స్ లో ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు.

ఈ గేమ్ పిపుల్స్ ఛాయిస్ అవార్డు కూడా అందుకుంది.

గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి కాని, ఐసిసి అఫిషియల్ గా తయారుచేసిన గేమ్ అంత అద్భుతంగా ఉండవు.కాని గేమ్ ప్లే విషయంలో అఫిషియల్ క్రికేట్ గేమ్ దీని ముందు దండగ.అందుకే క్రికెట్‌ గేమ్స్ డవున్లోడ్స్ లో “వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2” నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

వివరాల్లోకి వెళితే, ఇందులో T20, ODI తో పాటు టెస్ట్ క్రికేట్ ఆడుకోవచ్చు.మరీముఖ్యంగా టెస్ట్ క్రికేట్ చాలా అద్భుతంగా ఉంటుంది.గంటలకొద్ది టెస్ట్ మ్యాచ్ ఆడూతూ కూర్చునేంత అడిక్టివ్ గా ఉంటుంది.ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద స్టేడియమ్స్ అన్నిటిలో మీరు మ్యాచులు ఆడొచ్చు.

కామెంట్రి కూడా ఉంటుంది.వాఖ్యాతలు మీ ఆటతీరుని విశ్లేషిస్తూ ఉంటారు.

లిమిటెడ్ ఓవర్స్ క్రికేట్ విషయానికి వస్తే, మీ డ్రెస్ కోడ్ ని మీరే డిజైన్ చేసుకోవచ్చు.మీ ఫ్రెండ్ మొబైల్ గేమ్ లో కూడా ఈ గేమ్ ఉంటే, ఇద్దరు ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసి ఆడుకునే ఆప్షన్ కూడా ఉంది.“హాట్ ఇవెంట్స్” లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ సీరీస్ లను మీ మొబైల్ లో ఆడేయొచ్చు.ఇంకెందుకు ఆలస్యం .ఓసారి “World Cricket Championship 2” ఆడి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube