అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న సినిమా శ్రీరస్తు శుభమస్తు ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో కొత్త జోష్ తో కనిపిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు.సినిమాలో కొత్తగా కనిపిస్తున్న అల్లు శిరీష్ హిట్ కొడతాడని అన్నారు.
ఇక చిత్ర దర్శకుడు పరశురాం సినిమాను ఎంతో అద్భుతంగా తీశారని అన్నారు.బొమ్మరిల్లు లాంటి సినిమా అవుతుందని శ్రీరస్తు శుభమస్తు సినిమాకు తన బెస్ట్ విశెష్ అందించారు మెగాస్టార్ చిరంజీవి.
అయితే శ్రీరస్తు శుభమస్తు తన మనసుకి దగ్గరైన టైటిల్ అన్న చిరంజీవి ఇదే టైటిల్ తో తనది ఓ సినిమా ఉంది అది ఎవరు గుర్తించారో లేదో అన్నారు.
చిరంజీవి, సరిత జంటగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా 80వ దశకంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుందని చిరంజీవి గుర్తు చేశారు.
ఇక శిరీష్ కు బెస్ట్ విశెష్ అందిస్తూ కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పుడు విజయం తన వెంట ఉంటుందని.వెనుక అల్లు అరవింద్, చిరంజీవి ఉన్నా సరే అవి సినిమాల అవకాశాలొస్తాయే కాని హిట్ అవ్వాలంటే కష్టపడాలని అన్నారు.
మెగా అభిమానుల హుశారెత్తించే కేకలతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక ఆగష్టు 5న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.
అల్లు శిరీష్ ఏ సినిమాకు లేని రిలీజ్ ముందు ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమాకు కలిసి వస్తుంది.మరి శిరీష్ కొట్టబోయే మొదటి హిట్ శ్రీరస్తు శుభమస్తు అవుతుందేమో చూడాలి.







