పవర్ స్టార్ పవన్ కళ్యాన్ డాలి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం మొన్నటిదాకా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అన్న చిత్రయూనిట్ ఇప్పుడు ఆమెను తప్పించి రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా ఉన్న రకుల్ సినిమాలో ఉన్న అదనపు ఎట్రాక్షన్ తో పాటుగా కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్ కూడా ఏర్పడింది.
ఇక కొద్దికాలంగా డైరక్టర్స్ మార్పులతో షూటింగ్ వాయిదా వేసిన పవన్ కళ్యాణ్ రకుల్ జోడితో కొత్త కలరింగ్ తీసుకు వస్తున్నాడట.
ఎస్.
జె సూర్య వదిలిన ఈ ప్రాజెక్ట్ కు ఎంట్రీ ఇచ్చిన డైరక్టర్ డాలి తన వర్షన్ లో సినిమా రాసుకునేందుకు కొద్దిపాటి టైం పట్టింది.ఇక ఫైనల్ గా ఇవాలో రేపో తదుపరి షెడ్యూల్ కు సంబందించిన విషయాలను ఎనౌన్స్ చేస్తారట చిత్ర నిర్మాత శరద్ మరార్.
మరి ఓ పక్క మహేష్, మురుగదాస్ సినిమాలో అవకాశం దక్కించుకున్న రకుల్ పవర్ స్టార్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఇక రకుల్ ను కొట్టేవాడే లేరన్న పరిస్థితి ఏర్పడింది.మరి పవన్ హీరోయిన్ రకుల్ అన్న వార్తలు ఎంతవరకు నిజమో చిత్రయూనిట్ ఎనౌన్స్ చేస్తే గాని తెలియదు.







