కాంగ్రెస్ పార్టీలోనే మోస్ట్ సీనియర్ బ్యాచులర్ గా ఉన్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి మరోమారు తెరపైకి వచ్చింది.ఇదేం గొప్పవిషయం అని చిత్రంగా అనిపించినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా హాట్ టాపిక్ ఇదేగా మారింది.
ఇందుకు కారణం ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే.ఆ రాష్ట్రానికి చెందిన ఒక బ్రాహ్మణ యువతిని రాహుల్ పెళ్లి చేసుకోబుతున్నాడంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది.
స్వామికి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు కొత్తకాకున్నా, గత కొంత కాలం క్రితం గా ఆయన ఆయువతితో తిరుగుతున్నారని విదేశాలు కూడా తీసుకెళ్లారంటూ గుసగుసలు వినిపించిన విషయం విదితమే.కాగా బాకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే ఆయనను పెళ్లి చేసుకునేందుకు తను సిద్ధంగా ఉన్నానని ఆమ ధ్య లీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ కూడా ప్రకటించి సంచలనం రేపింది.
అయితే 2017 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా తన వివాహం ఉండాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు వినవస్తోంది.ఈ ్రకమంలో యూపీకి చెందిన ఓ ప్రముఖ రాజకీయనేత కుమార్తెను వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా వ్యవహరించిన వ్యక్తి ఈ సంబంధం కుదిర్చినట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.రాహుల్ పెళ్లి కూడా రాజకీయ ఎత్తుగడలో భాగం కావటం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి
.