సినిమాలైతే చేస్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంలో తమన్నా ఎప్పుడు వెనుకపడుతూనే ఉంది.మిల్కీ బ్యూటీగా కుర్రాళ్ల ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉన్నా తమన్నాకు టాప్ చెయిర్ మాత్రం కట్టపెట్టలేదు.
అయితే ఇన్నాళ్లు గ్లామర్ రోల్ లో నటించి మెప్పించిన తమన్నా ఇప్పుడు మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమానే అభినేత్రి.
ఏ.ఎల్.విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవ హీరోగా చేస్తున్నాడు.అయితే తెలుగులో ఈ సినిమాను కోనా వెంకటే నిర్మాణ భాధ్యతలను మీద వేసుకున్నాడు.
అందుకే అభినేత్రి ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ఆలోచనతో అలనాటి అందాల భామ శ్రీదేవి చేత అభినేత్రి ఆడియో రిలీజ్ చేయిస్తున్నారట.
ముందు ఆమె నుండి రాలేననే ఆన్సర్ వచ్చినా తప్పనిసరిగా రావాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఒప్పించారట.
తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో శ్రీదేవి రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్రయూనిట్ ఆలోచన.ఇక ఆగష్టు 15న ఈ ఆడియో వేడుక జరుగనున్నదట.
అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కోసం హాట్ గాళ్ ఏమీ జాక్సన్ తో ఓ సాంగ్ కూడా చేయించారు.సో సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.
మరి అందరు ఊరిస్తున్న ఈ అభినేత్రి ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
.






