బాలివుడ్ హాట్ బాంబ్ సన్ని లియోన్ ఏ చిన్న పని చేసినా, వెంటనే వార్తల్లోకి ఎక్కేస్తుంది.అలాంటిది మొదటిసారి పాట పాడబోతోందని తెలిస్తే మీడియా ఊరుకుంటుందా.
సన్ని లియోన్ ఈ చిత్రంలో పాట పాడబోతోంది, కాదు ఆ చిత్రంలో పాట పాడబోతోందని పెన్నుకి వచ్చిన సినిమా పేర్లన్ని రాసేసారు.
కాని సన్ని పాట పాడబోతోందన్న విషయం మాత్రమే నిజం.
సినిమా కోసం పాడుతోందనేది అబద్ధం.అవును, సన్ని లియోన్ ఏదో సినిమా కోసం కాదు, ఒక పెద్ద ఈవెంట్లో పబ్లిక్ గా పాట పాడబోతోంది.
“నేను మీకు చెప్పేదేంటంటే, ఏదో సినిమా కోసం పాట పాడట్లేదు.ఒక పెద్ద ఈవెంట్లో నిజంగానే పాడబోతున్న.
చాలా భయంగా ఉంది.
అందుకోసమే రిహర్సల్స్ మొదలుపెట్టా.
పదాలు బాగా పలకాలి కాబట్టి, అందరికి అర్థం కావాలి కాబట్టి, నెలరోజులుగా గొంతు సవరించుకోని పాడటం ప్రాక్టీస్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది సన్ని.
నిజంగా సన్ని ధైర్యానికి మెచ్చుకోవాలి.
ఎందుకంటే చాలామంది ప్రోఫేషనల్ సింగర్స్ కూడా పబ్లిక్ ఈవెంట్స్ లో అప్పటికప్పుడు సొంతంగా పాడకుండా, రికార్డు చేసిన ట్రాక్ కి పెదాలు కలుపుతూ ఉంటారు.అలాంటిది మొదటిసారికే మోసం చేయకుండా, అప్పటికప్పుడు సొంతంగా, పబ్లిక్ లో పాడబోతోంది సన్ని లియోన్.







