త్రిష లీడ్ రోల్ లో తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న సినిమా నాయకి.ఎన్నో రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఇన్నిరోజులు ఆగారు.
ఇక తెలుగులో ఎప్పుడో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న త్రిష నాయకి ఇంకా తమిళ్ లో సెన్సార్ స్క్రూట్నీకి నోచుకోలేదు.దాని ఫలితంగా జూలై 8న రిలీజ్ అంటూ ప్రచారం చేసిన సినిమా మరో వారం రోజులు పోస్ట్ పోన్ అవుతుంది.
గోవి డైరెక్ట్ చేసిన నాయకి సినిమాలో త్రిష రెండు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తుంది.
హర్రర్ కామెడీ నేపథ్యంతో వస్తున్న నాయకి ముందునుండి పోస్టర్స్ తో తెగ హడావిడి చేస్తుంది.
మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న త్రిష ఈ నాయకి మీద చాలా హోప్స్ పెట్టుకుంది.అంతేకాదు తన పాత్రకు కష్టపడి మరి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది ఈ భామ.అన్ని అయ్యాయి ఇక రిలీజ్ అవడమే తరువాయి అనుకుంటే తమిళ సెన్సార్ క్లియర్ కాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తున్నారని తెలిపాడు డైరక్టర్ గోవి.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం నాయకి జూలై 15న వచ్చే అవకాశాలున్నాయట.
మరి ఆరోజైనా వస్తుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అన్నది చూడాలి.







