గత కొంత కాలంగా సదావర్తి భూములు వ్యవహారంపై విపక్షాలు తెలుగుదేశం ్రపభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఆ భూముల కొనుగోలు వ్యవహారంపై ఎట్టకేలకు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ్య స్పందించారు.
ప్రభుత్వం వేలం పెట్టిన సదావర్తి భూములను నిబంధనలకు అనుగుణంగానే తన కుమారుడు కొనుగోలు చేస్తే వైకాపా నేతలు అనవర రాధ్దాంతానికి దిగుతున్నారని విమర్శిచారు.
సోమవారం ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ్రపభుత్వ వేలంలో పాల్గొన్న తమిళ వ్యాపారులు రూ.10 లక్షలు మాత్రమే కోట్ చేస్తే, తన కుమారులు రూ.22 కోట్లు పెట్టి కొన్నట్టు తెలిపారు.విపక్షాలు చెప్తున్నట్టు ఈ సదావర్తి భూములు ఎకరా రూ.6 కోట్లు ఉంటుందన్న ఆరోపణలు అర్ధం లేనివని చెప్పారు.సదావర్తి భూములను తన కుమారుడు కొన్నందున తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
బహిరంగ వేలాం విషయం అన్న ప్రతికలలో వచ్చిందని, నేడు అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్న వైకాపా నేతలు వేలం జరిగిన రోజున దానిలో ఎందుకు పాల్గొనలేదని నిలదీసారు.రూ.30 కోట్లు ఇస్తే ఎవరికైనా తాము కొనుక్కున్న భూములను ఇచే్చసేందుకు సిద్ధంగా ఉన్నానని తీసుకునేందుకు వైకాపా నేతలు సిద్ధమేనా అని చలమశేట్టి సవాల్ విసిరారు.
.






