దారుణం : ఆమెని గ్యాంగ్ రేప్ చేసారు .. ఆమె తో సెల్ఫీ

సెల్ఫీ పిచ్చి తో జనాలు కొట్టుకుంటున్నారు.ప్రతీ అడ్డవైన విషయాన్నీ సేల్ఫీ తీసి పెట్టడం ఈ రోజుల్లో బాగా కామన్ అయిపొయింది.

 Selfie With Gang Rape Victim-TeluguStop.com

సెలెబ్రిటీ లు సామాన్యులూ అనే తేడా లేకుండా అదే పనిలో ఉన్నారు.సెలెబ్రిటీ లు సామాన్యులని చూస్తే ఇక చెప్పక్కర్లేదు పరిస్థితి.

అదే లెక్కలో దిగుతూ ఉంటారు ఫోటోలు.ఈ పిచ్చి పరాకాష్ట కి చేరినట్టు కనిపిశ్తోంది.

ఈ సంఘటన చదివిన తరవాత మీరు కూడా అదే అనుకుంటారు అనడం లో ఆశ్చర్యం లేదు.సోమ్యా గుర్జార్ అనే రాజస్థాన్ మహిళా కమీషన్ సభ్యురాలు ఒక గ్యాంగ్ రేప్ బాధితురాలిని కలవడానికి వెళ్ళారు.

ఆమె తో పాటు కమీషన్ చైర్ పర్సన్ సుమన్ శర్మ కూడా కనిపించారు.ఆమెని కలవడం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఆ గ్యాంగ్ రేప్ బాధితురాలి తో సెల్ఫీ దిగి సంచలనం సృష్టించారు ఆమె.

ఈ సేల్ఫీ లో ఆమెతో పాటు చైర్ పర్సన్ కూడా ఉండడం తో ఇప్పుడు ఇది వివాదాస్పదం అయ్యింది.అయితే తాను బాధితురాలితో మాట్లాడుతున్న సమయంలో సోమ్యా సెల్ఫీ తీసుకున్నారని ఆ విషయం తనకు తెలియదని చైర్ పర్సన్ సుమన్ శర్మ అన్నారు.

ఇలాంటి చర్యలను తాను సమర్థించనని దీనిపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా ఆమెను ఆదేశించినట్లు చెప్పారు.అయితే తనకు తెలియకుండానే ఫొటో తీసిందని సుమన్ శర్మ చెబుతున్నా.ఫొటోలో మాత్రం ఆమె కూడా కెమెరావైపే చూస్తున్నట్లు కనిపించడం విశేషం.రెండు రోజుల కిందట ఆ మహిళను భర్త – మరదలే తీవ్రంగా హింసించి ఒళ్లంతా పచ్చబొట్టు పొడిచి.

ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube