కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతి భధ్రతలను దెబ్బతీసేందుకు ముద్రగడ పద్మనాభం, మందకృష్ణలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నాడని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరోపించారు.గుంటూరు జిల్లా మంగళగిరిలో కాపు సంఘాల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముద్రగడ జై కొడుతున్న వైఎస్ హయాంలో కాపుల రిజర్వేషన్ల సర్వేకు కనీస ఖర్చుకూడా చేయలేదని, ఆదిశగా మంత్రిగా ఉన్న ముద్రగడ ఎందుకు నిలదీయలేదని ఆయని ప్రశ్నించారు.
గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి కృషి చేస్తున్నారని, ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా లనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం గుర్తించాలని అన్నారు
కాపులెవరూ జగన్ ట్రాప్‌లో పడవద్దని విజ్ఞప్తి చేశారు.మూడు నెలల క్రితమే తుని ఘటన కేసును సీఐడీకి అప్పగించామని ఆయన తెలిపారు.రెండు రోజుల క్రితం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారని అన్నారు.రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు కొన్ని శక్తులతో కలసి జగన్ కుట్రలు పన్నుతున్నారని, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన… అలాంటి వారి వలలో కాపులు పడొద్దని కాపు సంఘాల నేతలకు సూచించినట్లు తెలిపారు.
తుని ఘటనలో అమాయకులను అరెస్టు చేసారని వారిని విడుదల చేయాలనటం అభ్యంతర కరమని, మూడు నెలల క్రితమే ్రపభుత్వం ఈ కేసు సీఐడీకి అప్పగించిన విషయం తెలియనిదా, ప్రస్తుతం ఈ విషయం అంతా కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, రైళ్లు, పోలీసు ఠాణాల దహనం కేసులను ఉపసంహరించే ప్రసక్తే లేదని మరో సారి స్ఫష్టం చేశారు.
ముద్రగడ మొండి వైఖరితో కాపులకు నష్టం కలుగుతున్న విషయం గుర్తించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నిరకాల పదవులు అనుభవించిన నేతలంతా అప్పుడు కాపుల సంక్షేమం కోసం కనీసం మాట్లాడలేదని ఇప్పుడు వైకాపాలో చేరి, మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
కాపుల సంక్షేమం కోసం తామేం చేసారో వాటి వివరాలపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారాయన.
ముద్రగడ దీక్ష విరమించాలని కోరుకుంటున్నామని, ఈ దీక్షను బూచిగా చూపి వైకాపా మరోమారు కుటిల యత్నం చేసే అవకాలున్నందున, జగన్ ట్రాప్‌లో పడి, దానిలో కాపు యువకులు భాగస్వాములై కేసుల్లో ఇరుక్కోవద్దని చినరాజప్ప సూచించారు.
.






