ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ.ప్రభుత్వ రెండేళ్ల పాలనపై జూన్ 8న ఒంగోలులో సంకల్ప సభ నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు .
బుధవారం ముఖ్యమం్రతి చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలను ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాయంత్రం మీడియాకు వెల్లడిస్తూ… రాష్ట్రంలోని వాస్తవ పేదలను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని.నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇటీవల మహానాడులో చంద్రబాబు అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే చేపడతామని ప్రకటించిన విషయం విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై జూన్ 20 నుంచి 30 తేదీ వరకు, జులై 5 నుంచి 30 వరకు రెండు విడతలుగా పల్స్ సర్వే పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
మరోవైపు పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్ధం అవుతుండటంతో పాఠశాలల్లో చదివే 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు.ఇది కేవలం ప్రభుత్వ ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ శాఖ పనితీరు మరింత మెరుగు పంరచుకుంటూనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ‘ఉదయ్’ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది మంత్రి మండలి.
ప్రమాదంలో మృతిచెందినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.5లక్షల వరకు ఆర్థికసాయం అందజేసేలా చంద్రన్న బీమా పథకం విధివిధానాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని, అట్లాగే వివిధ శాఖలలోని పదివేల ఖాళీలను భర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వీటిల్లో గ్రూప్ 1 ద్వారా 94, గ్రూప్ 2లో 750 పోస్టులు, గ్రూప్ 3 కేటగిరీలో 1000 పోస్టులు భర్తి చేయటంతో పాటు పోలీసు శాఖలో 6 వేలను భర్తీ చేయాలని టెక్నిషియన్స్ 1000, వైద్య ఆరోగ్య శాఖలో 422, ఇతర శాఖల్లోని 732 పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు రఘునాధరెడ్డి వివరించారు.







