ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్తితుల్లో ప్రత్యేక హోదా అత్యవసర మని సినీ హీరో, తెలుగుదేశం హిందుపురం శాసన సభ్యులు బాలకృష్ణ స్పస్టం చేసారు.శనివారం తిరుపతిలోని టౌన్ క్లబ్ సెంటర్‌లో ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి ఆయన ముఖ్యమం్రతి చంద్రబాబు,తో పాటుగా పాలాభిషేకం చేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా వెండి తెరపై ఎనెన్నో పాత్రలు పోషించి, మెప్పించిన ఎన్టీఆర్ వాటి ప్రభావంతో తనని అభిమానించి ఆరాధిసు్తన్న తెలుగువారికి మంచి చెయాలన్న తపనలో నుంచే తెలుగుదేశం పార్టి ఉద్బవించిందన్నారు .9 నెలల్లో అధీ కారంలోనికి వచ్చి జాతి గర్వ పడేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆయనదేనని అన్నారు
బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా తెలుగు ప్రజల గుండెల్లో నేటికీ చిరస్మరణీయంగా ఉన్నారని బాలకృష్ణ అన్నారు తెలుగు రాష్ట్రాల విభజన అంతర హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వల్సిదేనని స్పష్టం చేసారాయన
ఏపీకి ప్రత్యేక హోదా అవసరమంటూనే చంద్రబాబుపై ఎన్‌టిఆర్ సమాధి సాక్షిగా హరికృష్ణ చేసిన విసుర్లకు తోడు చంద్రబాబుపై బాలకృష్ణ వ్యాఖ్యలపై విశ్లేషణలు మొదలయ్యాయి .
కాగా….తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా జరిగిన గత ఎన్నికల ప్రచార సమయంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మోదీ హామీకి రెండేళ్లయినా అతీగతి లేదని బాబు బాలయ్యతో చెప్పించారని దేశం వర్గాల కధనం ప్రత్యేక హోదా రాకుండా భాజపా నేతలే మోకాలడ్డుతుండటం… ఆంధ్రుల ఆందోళన తదితర విషయాలపై మహానాడు వేదిక నుంచి బాలయ్యద్వారానే చెప్పిస్తీ బహు బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు .







