తెలంగాణ సిఏం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రప్రజలకు తెగ నచ్చేసారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటి ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న గులాబినేతని, మరోమారు మరో విధంగా గెలిపించారు తెలంగాణ ప్రజలు.
ప్రజలకు ముఖ్యమంత్రులపై ఉన్న సంతృప్తి, అసంతృప్తి గురించి తెలుసుకోవడానికి ఒక పోల్ నిర్వహించింది విపిడిఏ .ఈ ఓటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.86% శాతం ఓటర్లు కేసిఆర్ పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.కేసిఆర్ తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు.81% ప్రజలు ఆయన పాలనతో సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 5వ స్థానాన్ని పొందారు.69% ఓటర్లు ఆయన పక్షాన నిలిచారు.
ఇక మొదటి పది స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
1) కేసిఆర్ – 86%
2) శివరాజ్ సింగ్ చౌహాన్ – 81%
3) మమతా బెనర్జీ – 75%
4) జయలలిత – 72%
5) చంద్రబాబునాయుడు – 69%
6) అరవింద్ కేజ్రివాల్ – 65%
7) వసుంధర రాజే – 61%
8) నితీష్ కుమార్ – 59%
9) దేవేంద్ర ఫెద్నవిస్ – 58%
10) లక్ష్మీకాంత్ పరేసర్ – 52%







