కరుణాకరన్ పేరు వినగానే పవన్ కల్యాణ్ తో ఆయన తెరకెక్కించిన ‘తొలి ప్రేమ’ సినిమా గుర్తుకు వస్తుంది.యూత్ హృదయాలను కొల్లగొడుతూ ఆ సినిమా సాధించిన విజయం కళ్లముందు కదలాడుతుంది.
అలాంటి కరుణాకరన్ దర్శకత్వంలో మళ్లీ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందనుంది .అదీ రామ్ హీరోగా.గతంలో రామ్ హీరోగా ఆయన ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా చేశాడు.అయితే అది రామ్ అభిమానులను నిరాశపరిచింది.అయినా ఈసారి కరుణాకరన్ వినిపించిన కథ నచ్చడంతో, రామ్ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు.
ప్రస్తుతం రామ్ .‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తరువాత ఆయన కరుణాకరన్ తో చేయనున్నాడు.
రామ్ తనకి హిట్ ఇచ్చిన దర్శకుడికే కాదు .ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి కూడా ఛాన్స్ ఇవ్వడం విశేషం.







