తెలంగాణా ఆవిర్భావ కానుక సిద్ధమా?

తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది.ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది.

 Telangana Formation Day Gift Ready?-TeluguStop.com

జిల్లాలకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి.ఇంత సంతోషకరమైన సమయంలో తనను నమ్ముకున్న రాజకీయ నాయకులను కూడా సీఎం కెసీఆర్ సంతోష పెట్టాలి కదా.అలా సంతోష పెట్టే కానుక పేరే నామినేటెడ్ పోస్టులు.నామినేటెడ్ పోస్టులు తొందరలోనే భర్తీ చేస్తామని పార్టీ ప్లీనరీలో ప్రకటించారు.

ఈ లోగా పాలేరు ఉప ఎన్నిక విజయం కూడా దక్కబోతున్నదని అనుకుంటున్నారు.కాబట్టి సంతోషకరమైన సమయంలో నాయకులను నిరాశ పరచకూడదని సీఎం అనుకుంటున్నారు.

ఇప్పటివరకు ఆర్టీసీ చైర్మనుగా సోమారపు సత్యనారాయణను, మిషన్ భగీరథ వైస్ చైర్మనుగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డిని నియమించారు.

ఇంకా చాలా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

అందుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం.నామినేటెడ్ పోస్టుల కాల పరిమితి రెండేళ్ళే కాబట్టి త్వరగా భర్తీ చేయాలని నాయకులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube