పవన్ తో చేయడానికి సిద్ధమే కాని ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిట అదృష్టదేవతగా శృతిహాసన్ పేరు చెబుతారు.వరుస ఫ్లాపుల తరువాత వచ్చిన గబ్బర్ సింగ్ లో జోడి కట్టింది కదా.

 Shruti Haasan Will Do Pawan’s Film Only With Availability Of Dates-TeluguStop.com

ఆ గబ్బర్ సింగ్ విడుదలై నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సందంర్భంగా పవన్ అభిమానులకి ఓ శుభవార్త.

మీడియా గతకొన్ని రోజులుగా చెబుతున్న పవన్ – శృతి మళ్ళీ కలిసి నటిస్తున్నారు అనే వార్త గాలికబురు కాదు.

పవన్ కళ్యాణ్ – ఎస్ జే సూర్య కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో ప్రస్తుతానికైతే శృతియే హీరోయిన్.

ప్రస్తుతానికైతే అని ఎందుకు అనాల్సివచ్చిందంటే, శృతితో చర్చలైతే జరిపారు కాని, డేట్స్ ఎప్పుడెప్పుడు కావాలో ఇంకా చెప్పలేదంట.

పవన్ హాలిడే ట్రిప్ నుంచి తిరిగి వస్తే తప్ప, షూటింగ్ మొదలు పెట్టేది ఎప్పుడు, ఎవరి డేట్స్ ఎప్పుడు కావాలో డిసైడ్ చేసుకోవడం కష్టమే కదా.అందుకే డేట్స్ అందుబాటులో ఉంటేనే సినిమా చేస్తానని చెప్పిందట శృతి.

సో, పవన్ వచ్చి ఎస్ జే సూర్యతో షూటింగ్ ప్లాన్ మొత్తం మాట్లాడాలి.

అప్పుడే మనకు శృతి ఉండేది, ఉండనిది ఖచ్చితంగా తెలుస్తుంది.శరత్ మరార్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క రెగ్యూలర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube