కేసిఆర్ ప్రకటించిన సాయం ... బాధ్యత లేని అధికారులు

సీనియర్ సినీ ఆర్టిస్టు, రంగస్థల నటి పావల శ్యామల జీవనాధారం లేకుండా కాలం వెళ్ళదీస్తున్న సంగతి తెలిసిందే.చేతిలో సినిమాలు లేక, చేతికందే ఫించన్ లేక, ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఈ వృద్ధ నటి.

 Pavala Shyamala Financial Struggle Continues-TeluguStop.com

శ్యామల పరిస్థితి తెలంగాణ సీఎం కేసిఆర్ దృష్టికి రావడంతో, వెంటనే స్పందించిన గులాబి అధినేత, తక్షణమే 20 వేల ఆర్థిక సహయాన్ని అందించారు.అక్కడితో సరిపెట్టకుండా నెలకి 10 వేల ఫించనుతో పాటు, డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయమని అధికారులను అదేశించారు.

ఈ విషయాన్ని దగ్గరుండి చూసుకొమ్మని తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు ప్రత్యేకంగా చెప్పారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించినా, అధికారుల్లో చలనం లేదు.పావలా శ్యామలకి అందాల్సిన ఫించను అందట్లేదని సమాచారం.ఈ విషయం కూడా ముఖ్యమంత్రి చెవిలో పడి, స్వయంగా ఆయనే రంగంలో దిగితే తప్ప పని జరగదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube